ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi Teacher: ఐఫోన్ 13 కోసం ఎంతకు తెగించారో చూడండి.. పాపం ఈ టీచర్..!

ABN, First Publish Date - 2023-08-14T20:48:50+05:30

యోవికా చౌదరి అనే మహిళ ఢిల్లీలోని Saket's Gyan Bharti స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. రోజూలానే స్కూల్‌కు వెళ్లి గత శుక్రవారం సాయంత్రం ఆటోలో ఇంటికి వెళుతుండగా ఇద్దరు దుండగులు బైక్‌పై ఆటోను వెంబడించారు. ఆమె చేతిలోని ఐ-ఫోన్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశారు. యోవికా ప్రతిఘటించడంతో ఆ పెనుగులాటలో ఆమె ఆటోలో నుంచి కిందపడిపోయింది. అదే అదనుగా ఆమె పక్కన పడి ఉన్న ఐ-ఫోన్‌ను దొంగిలించి దుండగులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో యోవికా ముఖానికి గాయాలయ్యాయి.

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే దారి దోపిడీలు చేస్తూ నగర ప్రజలను హడలెత్తిస్తున్నారు. గత శుక్రవారం జరిగిన ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. యోవికా చౌదరి అనే మహిళ ఢిల్లీలోని Saket's Gyan Bharti స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. రోజూలానే స్కూల్‌కు వెళ్లి గత శుక్రవారం సాయంత్రం ఆటోలో ఇంటికి వెళుతుండగా ఇద్దరు దుండగులు బైక్‌పై ఆటోను వెంబడించారు. ఆమె చేతిలోని ఐ-ఫోన్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశారు.


యోవికా ప్రతిఘటించడంతో ఆ పెనుగులాటలో ఆమె ఆటోలో నుంచి కిందపడిపోయింది. అదే అదనుగా ఆమె పక్కన పడి ఉన్న ఐ-ఫోన్‌ను దొంగిలించి దుండగులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో యోవికా ముఖానికి గాయాలయ్యాయి. వెంటనే ఆమెను మ్యాక్స్ సాకేత్ హాస్పిటల్‌కు తరలించారు. ముక్కుకు, ముఖంపై ఇతర భాగాల్లో గాయం కావడంతో ఆమెకు వైద్యులు తగిన చికిత్సనందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.

యోవికా ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలోని పీవీఆర్ దగ్గర ఆమె ఇంటికి వెళ్లడానికి ఆటో ఎక్కారు. ఆటో ఖోఖా మార్కెట్ వద్ద ఉండగా హోండా స్ప్లెండర్ మోటార్‌సైకిల్‌పై ఇద్దరు దుండగులు ఆమె చేతిలోని ఐఫోన్-13ను లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించారు. తన ఫోన్‌ను యోవికా పట్టువిడవకుండా పట్టుకోవడంతో దుండగులు బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆమె ఆటోలో నుంచి కిందపడింది. ఆ ఫోన్ దొంగిలించిన ఇద్దరి వయసు 20 ఏళ్లు ఉండొచ్చని, తలకు హెల్మెట్ పెట్టుకోలేదని ఫిర్యాదులో యోవికా చౌదరి పేర్కొంది. సాకేత్ అనే ప్రాంతం ఢిల్లీలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ ఏరియా. అలాంటి ప్రాంతంలో ఈ తరహా ఘటన జరగడంతో స్థానికంగా కలకలం రేగింది.

Updated Date - 2023-08-14T20:48:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising