First Rapid Rail: ఢిల్లీ-మీరట్ మొట్టమొదటి రాపిడిక్స్ రైలు...ఎన్‌సీఆర్‌టీసీ ప్రకటన
ABN, First Publish Date - 2023-04-12T10:06:24+05:30
భారతదేశంలోనే మొట్టమొదటి ర్యాపిడ్ రైలు రాపిడిక్స్ ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మార్గంలో నడవనుంది...
న్యూఢిల్లీ: భారతదేశంలోనే మొట్టమొదటి ర్యాపిడ్ రైలు రాపిడిక్స్ ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మార్గంలో నడవనుంది.(First Rapid Rail) అత్యంత వేగంగా నడిచే ఈ రైలుకు రాపిడిక్స్(RAPIDX) అని పేరు పెట్టినట్లు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) ప్రకటించింది. వేగవంతమైన పట్టణ మెట్రో రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న నోడల్ బాడీ దేశంలోని మొదటి సెమీ-హై-స్పీడ్ ప్రాంతీయ రైలు సేవలకు శ్రీకారం చుట్టనుంది.
ఇది కూడా చదవండి : Myanmar: తిరుగుబాటుదారులపై మిలటరీ దాడులు...100 మంది మృతి
వేగంతోపాటు అధునాతన సాంకేతికతతో నడిచే ఈ రైలు వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ (Delhi-Meerut)మార్గంలోని 82-కిలోమీటర్ల పొడవైన కారిడార్ లో రాపిడిక్స్ రైలు సేవలు అందించనుంది. ఎన్‌సిఆర్‌టిసి ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌లో రాపిడిక్స్ రైలు 2025 నాటికి ప్రజల కోసం ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.మీరట్‌లో స్థానిక ప్రజా రవాణా సేవల కోసం ప్రత్యేకంగా 8 స్టేషన్‌లు నిర్మించనున్నారు.
Updated Date - 2023-04-12T10:12:26+05:30 IST