Joshimath: జోషిమఠ్‌లో ఇళ్ల కూల్చివేతలు ప్రారంభం
ABN, First Publish Date - 2023-01-10T11:17:34+05:30
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ పట్టణంలో మంగళవారం ఇళ్ల కూల్చివేతలు ప్రారంభం అయ్యాయి...
జోషిమఠ్(ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ పట్టణంలో మంగళవారం ఇళ్ల కూల్చివేతలు ప్రారంభం అయ్యాయి.(Demolition drive) పగుళ్లు ఏర్పడిన ఇళ్లు, హోటళ్లను అధికారులు కూల్చివేశారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సురక్షితం కాని నిర్మాణాలను(unsafe structures)కూల్చివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సందు ఉత్తర్వులు జారీ చేశారు. ఎముకలు కొరికే చలికాలంలో జోషిమఠ్(Joshimath) వాసులు వారి ఇళ్ల నుంచి బయటకు వచ్చి తాత్కాలిక ఆశ్రమాలకు వెళ్లారు. భూమి దిగబడటంతో జోషిమఠ్ లో ఇళ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. పగుళ్లు ఏర్పడిన ఇళ్ల సంఖ్య 678కి పెరిగాయి. మరో 27 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.
ఇప్పటి వరకు 82 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దెబ్బతిన్న ఇళ్లకు అధికారులు రెడ్ క్రాస్ మార్కులు వేశారు. బాధిత కుటుంబాలకు నెలకు 4వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థికసాయం అందించారు.ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బాధిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. చమోలిలో భద్రత,రెస్క్యూ ఆపరేషన్ల కోసం అదనంగా 11 కోట్ల రూపాయలను విడుదల చేశారు.
Updated Date - 2023-01-10T11:21:51+05:30 IST