ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul Sipliganj : ధూల్‌పేట్‌ టు ఆస్కార్‌!

ABN, First Publish Date - 2023-03-14T03:48:14+05:30

ధూల్‌పేట్‌, మంగళ్‌హాట్‌ బస్తీల్లో తిరుగుతూ.. వినాయక ఉత్సవాల్లో మండపాల వద్ద పాటలు పాడుతూ.. గల్లీల్లో కబడ్డీ ఆడుతూ.. నోటికొచ్చిన పాటలతో స్నేహితుల మధ్య తిరిగే ఆ యువకుడు ఆస్కార్‌కు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గల్లీల్లో పాటలతో రాహుల్‌ ప్రస్థానం షురూ

హైదరాబాద్‌ సిటీ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ధూల్‌పేట్‌, మంగళ్‌హాట్‌ బస్తీల్లో తిరుగుతూ.. వినాయక ఉత్సవాల్లో మండపాల వద్ద పాటలు పాడుతూ.. గల్లీల్లో కబడ్డీ ఆడుతూ.. నోటికొచ్చిన పాటలతో స్నేహితుల మధ్య తిరిగే ఆ యువకుడు ఆస్కార్‌కు ఎదిగాడు. ధూల్‌పేట్‌ బస్తీలోని ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రాహుల్‌ సిప్లిగంజ్‌.. చిన్నతనంలోనే పాటలపై ఆసక్తి పెంచుకున్నాడు. తన కొడుకును బాగా చదివించాలని తండ్రి ఆశపడ్డాడు. కానీ, రాహుల్‌ చదువు మీద శ్రద్ధ చూపకుండగా.. సంగీతంపై ఆసక్తి చూపుతున్నా.. ఆయన కోప్పడలేదు. కుమారుడి ఇష్టాన్ని గౌరవించి, వెన్నుతట్టి ప్రోత్సహించారు. రాహుల్‌ ఓ వైపు పాటల ప్రాక్టీస్‌ చేస్తూనే.. మరోవైపు నాంపల్లిలోని వారి బార్బర్‌ షాప్‌లో పని చేసేవాడు. రాహుల్‌కు తొలిసారిగా నాగచైతన్య సినిమా జోష్‌లో ‘కాలేజీ బుల్లోడా’ అనే పాట పాడే అవకాశం వచ్చింది. సంగీత దర్శకుడు కీరవాణి... రాహుల్‌ ప్రతిభను గుర్తించారు. దమ్ము సినిమాలో ‘వాస్తు బాగుందే’ పాటను పాడే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పలు సినిమాల్లో పాటలు పాడిన రాహుల్‌.. ప్రేక్షకుల మన్నననలు అందుకున్నాడు.

Updated Date - 2023-03-14T03:48:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising