Diwali bonanza: ఉద్యోగులకు డీఏ పెంపుతో పాటు బోనస్.. యోగి తీపి కబురు
ABN, First Publish Date - 2023-11-06T17:17:32+05:30
లక్నో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీపావళి బొనంజా ప్రకటించారు. ప్రభుత్వ వర్కర్లు, ఎయిడెడ్ ఎడ్యుకేషనల్, టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, యూజీసీ ఉద్యోగులు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, పెన్షనర్లు సహా వివిధ కేటగిరి ఉద్యోగులకు మూలవేతనంలో 46 శాతం డీఏ ప్రకటించారు.
లక్నో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanth) డబుల్ బొనంజా ప్రకటించారు. దీపావళి కానుకగా ప్రభుత్వ వర్కర్లు, ఎయిడెడ్ ఎడ్యుకేషనల్, టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, యూజీసీ ఉద్యోగులు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, పెన్షనర్లు సహా వివిధ కేటగిరి ఉద్యోగులకు మూలవేతనంలో 46 శాతం డీఏ ప్రకటించారు. దీనికి ముందు గత మే 15న ఉద్యోగులకు ప్రభుత్వం మూలవేతనంలో 42 శాతం డీఏ పెంచింది.
కాగా, డీఏకు అదనంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ 30 రోజుల జీతానికి సమానమైన బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గరిష్ట పరిమితి రూ.7,000గా నిర్ణయించింది. ఈ బోనస్‌ను ప్రభుత్వ ఉద్యోగులు (నాన్ గెజిటెడ్), డిపార్టమెంటల్ ఆఫీసర్లు, టీచర్లు, నాన్-టీచింగ్ ఉద్యోగులు, డెయిలీ వేజ్ ఎర్నర్లు అందుకోనున్నారు.
Updated Date - 2023-11-06T17:17:33+05:30 IST