ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3 : చంద్రునిపై నాలుగు సింహాలు గర్జించబోతున్నాయ్?

ABN, First Publish Date - 2023-08-23T15:36:38+05:30

చంద్రయాన్-3 విజయవంతమయ్యే సమయం ఆసన్నమవుతోంది. మరికొద్ది గంటల్లో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లిపై అడుగు పెట్టబోతున్నాయి. అంతా సవ్యంగానే జరుగుతోందని, షెడ్యూలు ప్రకారమే అన్ని కార్యక్రమాలు జరుగుతాయని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ప్రకటించింది.

న్యూఢిల్లీ : చంద్రయాన్-3 విజయవంతమయ్యే సమయం ఆసన్నమవుతోంది. మరికొద్ది గంటల్లో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లిపై అడుగు పెట్టబోతున్నాయి. అంతా సవ్యంగానే జరుగుతోందని, షెడ్యూలు ప్రకారమే అన్ని కార్యక్రమాలు జరుగుతాయని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ప్రకటించింది. దీంతో బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగబోతోంది. దీనితోపాటు దిగే ప్రజ్ఞాన్ రోవర్ భారత దేశ జాతీయ చిహ్నాన్ని చంద్రునిపై ముద్రిస్తుంది. అశోకుని లయన్ కేపిటల్ నుంచి స్వీకరించిన ఈ చిహ్నంలో నాలుగు సింహాలు ఉంటాయి.

ప్రజ్ఞాన్ రోవర్ వెనుక చక్రాలు పరుగులు తీస్తూ ఈ జాతీయ చిహ్నాన్ని చంద్రునిపై ముద్రిస్తుంది. దీంతో భరతమాత కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరుతుంది.

జాతీయ చిహ్నంతోపాటు ఇస్రోను కూడా ఈ రోవర్ ముద్రిస్తుంది. దీంతో భారత దేశ ఔన్నత్యం చంద్రునిపై శాశ్వతంగా నిలిచిపోతుంది.

చంద్రునిపైగల నీటి మంచును అర్థం చేసుకుని, మానవ వినియోగానికి అనువుగా మార్చుకోవడం గురించి అధ్యయనం చేయడానికి చంద్రయాన్-3 దోహదపడుతుంది. ఈ కార్యక్రమం విజయవంతమైతే అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అవకాశాలు వెల్లువెత్తుతాయి.

చంద్రయాన్-3 విజయవంతమవాలని కోరుకుంటూ దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. సూరత్‌లోని ఓ దేవాలయంలో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలను చంద్రయాన్-3 ఇతివృత్తంతో నిర్వహించాలని నిర్ణయించారు.

చంద్రయాన్-3ని ఇస్రో బుధవారం సాయంత్రం 5.20 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్ చానల్, ఫేస్‌బుక్, డీడీ నేషనల్ టీవీలలో దీనిని చూడవచ్చు. అదే విధంగా దేశవ్యాప్తంగా అన్ని మీడియా చానళ్లు కూడా దీనిని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేశాయి.


ఇవి కూడా చదవండి :

Chandrayaan-3 : చంద్రునిపై భారత్ జయకేతనం ఎగురవేయాలంటూ కోట్లాది మంది పూజలు

Chandrayaan-3 : గతంలో ఇస్రోను ఎగతాళి చేసిన పాకిస్థానీ నేత, ఇప్పుడు ఏమంటున్నారంటే..

Updated Date - 2023-08-23T15:36:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising