Earthquake: కోస్టారికా, ఫిలిప్పీన్స్ దేశాల్లో భూకంపం
ABN, First Publish Date - 2023-04-05T07:46:03+05:30
కోస్టారికా, ఫిలిప్పీన్స్ దేశాల్లో భూకంపం సంభవించింది....
సాన్ జోస్(కోస్టారికా): కోస్టారికా, ఫిలిప్పీన్స్ దేశాల్లో భూకంపం సంభవించింది.(Earthquake) కోస్టారికా దేశ రాజధాని సాన్ జోస్(Costa Ricas capital San Jose) వద్ద సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. తెల్లవారుజామున 3.50 గంటలకు 31 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.
ఇది కూడా చదవండి: Kannada Star: బీజేపీలో చేరనున్న సినీస్టార్ కిచ్చా సుదీప్
దీంతోపాటు ఫిలిప్పీన్స్(Philippines) దేశంలో మంగళవారం రాత్రి సంభవించిన భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. మనీలా నగరానికి 514 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. కోస్టారికా, ఫిలిప్పీన్స్ దేశాల్లో భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. నిద్ర పోతున్న జనం భూప్రకంపనలతో బయటకు పరుగులు తీశారు.
Updated Date - 2023-04-05T07:47:05+05:30 IST