Earthquake: ఇండోనేషియాలో మళ్లీ భూకంపం
ABN, First Publish Date - 2023-04-13T08:03:30+05:30
భూకంపాలకు నిలయమైన ఇండోనేషియా దేశంలో మళ్లీ గురువారం భూకంపం సంభవించింది....
జకార్తా(ఇండోనేషియా): భూకంపాలకు నిలయమైన ఇండోనేషియా దేశంలో మళ్లీ గురువారం భూకంపం సంభవించింది.(Earthquake) ఇండోనేషియాలోని (jolts Indonesia)తనింబర్ దీవుల్లో గురువారం తెల్లవారుజామున 4.37 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9 గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే(United States Geological Survey) వెల్లడించింది. 70.2 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అధికారులు చెప్పారు.
ఇండోనేషియాలోని మలుకు ప్రావిన్స్‌లో ఉన్న తనింబార్ దీవులను(Tanimbar Islands) తైమూర్ లౌట్ అని పిలుస్తారు. 65 కంటే ఎక్కువ ద్వీపాలు ఉన్న ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవించాయి.ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇండోనేషియా అధికారులు చెప్పారు. గతంలోనూ తరచూ భూకంపాలు సంభవించడంతో ఆస్తి, ప్రాణనష్టం జరిగింది.
Updated Date - 2023-04-13T08:03:30+05:30 IST