ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Earthquake: గుజరాత్‌లో రెండు చోట్ల భూప్రకంపనలు

ABN, First Publish Date - 2023-02-27T14:49:38+05:30

గుజరాత్‌లోని కచ్, అమ్రేలిలో సోమమవారంనాడు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి కచ్‌లో తీవ్రత 3.8గా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుజరాత్: గుజరాత్‌లోని కచ్, అమ్రేలిలో సోమమవారంనాడు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి కచ్‌లో తీవ్రత 3.8గా నమోదు కాగా, అమ్రేలిలో 3.3 తీవ్రత నమోదైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం లేదు. అధికార వర్గాల సమాచారం ప్రకారం, కచ్ జిల్లాలో ఉదయం 10.49 గంటల ప్రాంతంలో 3.8 తీవ్రతతో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. లఖ్‌పట్‌ టౌన్‌‌కు 62 కిలోమీటర్ల దూరంలో, 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రెండవది అమ్రేలి జిల్లా మిటియాల గ్రామానికి సమీపంలో 7.1 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మధ్యాహ్నం 1.42 గంటలకు ఈ ప్రకంపనలు చోటుచేసుకునట్టు గాంధీనగర్‌లో ఐఎస్ఆర్ తెలిపింది.

వారం రోజుల్లో ఐదోసారి..

కాగా, అమ్రేలిలో 3.1 నుంచి 3.4 తీవ్రతతో గత వారం రోజుల్లో భూప్రకంపనలు చేటుచేసుకోవడం ఇది ఐదోసారి. సౌరాష్ట్ర ప్రాంతంలో అమ్రేలి జిల్లా ఉంది. గత రెండేళ్లలో సుమారు 4000 ప్రకంపనలు ఈ ప్రాంతంలో చోటుచేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. "ఎర్త్‌క్వేక్ స్వార్మ్''ఈ ప్రాంతాన్ని చెబుతుంటారు. స్వార్మ్ అనేది సహజంగా చిన్నచిన్న భూకంపాల తరహాలో ఉంటాయి. ప్రకంపనల తీవ్రత చాలా స్వల్పకాలమే ఉంటుంది. అయితే, రోజులు, వారాలు, కొన్నిసార్లు నెలల తరబడి కొనసాగుతుంటాయి. సహజంగా ఒకే లొకేషన్‌లో ఇవి చోటుచేసుకుంటుంటాయి. 2002లో కచ్ జిల్లాను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. సుమారు 13,800 మంది మృతి చెందగా, 1.67 లక్షల మంది గాయపడ్డారు. జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో భారీ ఆస్తినష్టం చోటుచేసుకుంది.

Updated Date - 2023-02-27T14:49:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising