ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ECIL : చంద్రయాన్‌-3లో ఈసీఐఎల్‌ పాత్ర

ABN, First Publish Date - 2023-08-24T03:28:55+05:30

చంద్రయాన్‌-3 దిగ్విజయంలో హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌ తన వంతు పాత్ర పోషించింది. ఇస్రో శాస్త్రవేత్తల సూచనల మేరకు 32 మీటర్ల ‘డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ యాంటెన్నా’ను

32 మీటర్ల యాంటెన్నా తయారీ.. ఇస్రోకు అప్పగింత..

భూమితో అనుసంధానానికి ఇది అత్యంత అవసరం!

కంచన్‌బాగ్‌ మిధానీ నుంచి ప్రత్యేక లోహ మిశ్రమాలు..

పేలోడ్స్‌ కోసం సాఫ్ట్‌వేర్‌ రాసిన ఉండవల్లి యువకుడు

గద్వాల, చంపాపేట, కుషాయిగూడ, జ్యోతినగర్‌, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): చంద్రయాన్‌-3 దిగ్విజయంలో హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌ తన వంతు పాత్ర పోషించింది. ఇస్రో శాస్త్రవేత్తల సూచనల మేరకు 32 మీటర్ల ‘డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ యాంటెన్నా’ను రూపొందించి అందజేసింది. చంద్రయాన్‌-3 విజయవంతమైన సందర్భంగా ఈసీఐఎల్‌ యాజమాన్యం దీనికి సంబంధించి పోస్టర్‌ను విడుదల చేస్తూ ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపింది. కాగా, చంద్రుడి నుంచి ల్యాండర్‌.. భూమ్మీద ఉన్న ప్రయోగ కేంద్రంతో అనుసంధానమయ్యేందుకు ఈ యాంటెన్నా ఎంతో కీలకమైనది. దీని ద్వారానే శాస్త్రవేత్తలు అంతరిక్ష నౌక గమనం, పర్యవేక్షణ, ప్రయాణం, పనితీరును మెరుగుపరచడం, సంకేతాలు పంపడం/స్వీకరించడం వంటివి చేపట్టారు. కాగా, చంద్రయాన్‌-3 విజయవంతంలో తమ సహకారం ఉందని కంచన్‌బాగ్‌లోని మిధానీ తెలిపింది. ల్యాండర్‌ విక్రమ్‌ పెలోడ్‌ కోసం టైటానియం రింగ్‌లు, బార్‌లు బ్లాక్‌లు అందించినట్లు చెప్పింది.

చంద్రయాన్‌-3లో జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి యువకుడు, బెంగళూరులోని యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న కృష్ణ కుమ్మరి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఐదుగురు సభ్యుల బృందంతో కలిసి ఈయన రెండు పేలోడ్స్‌ కోసం సాఫ్ట్‌వేర్‌ రాశారు. చంద్రయాన్‌కు పనిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీకి చెందిన కె.వెంకట కార్తీక్‌ ఉన్నారు. వెంకటకార్తీక్‌ మూడేళ్ల క్రితం ఇస్రోలో గ్రేడ్‌ 1 సైంటిస్టుగా చేరాడు. ఏపీలోని అనంతపురంనకు చెందిన శాస్త్రవేత్త సాయిచందన.. విక్రమ్‌ ల్యాండర్‌ నావిగేషన్‌-కంట్రోల్‌ బృందంలో పాలుపంచుకున్నారు. ల్యాండర్‌ ప్రారంభం నుంచి చంద్రుడి మీద దిగే వరకు ఈమె పర్యవేక్షణ చేశారు.

Updated Date - 2023-08-24T03:28:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising