ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3 : చంద్రయాన్-3ని పర్యవేక్షిస్తున్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ

ABN, First Publish Date - 2023-08-23T16:41:32+05:30

చంద్రయాన్-3ని పర్యవేక్షిస్తున్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (European Space Agency-ESA) బుధవారం ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి తమ సంస్థలో అన్ని వ్యవస్థలు సజావుగా ఉన్నట్లు తెలిపింది.

న్యూఢిల్లీ : చంద్రయాన్-3ని పర్యవేక్షిస్తున్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (European Space Agency-ESA) బుధవారం ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి తమ సంస్థలో అన్ని వ్యవస్థలు సజావుగా ఉన్నట్లు తెలిపింది. తమ సర్వీస్ మేనేజర్, ఇస్రో కోసం లయజన్ ఆఫీసర్‌గా పని చేస్తున్న రమేశ్ చెల్లతురాయ్ నుంచి మరింత సమాచారాన్ని పొందవచ్చునని ఓ ట్వీట్‌లో తెలిపింది.

చంద్రయాన్-3 కోసం తమ జెయింట్, మెకానికల్ యాంటెన్నాలు కఠోరంగా శ్రమిస్తున్నట్లు ఈఎస్ఏ చెప్పింది. అయితే అంతరిక్ష పరిశోధన కార్యక్రమానికి ఓ ప్రత్యేకతను సాధించినది మాత్రం మానవులేనని తెలిపింది. తమ బృందం రెండేళ్ల నుంచి చంద్రయాన్-3 కోసం పని చేస్తోందని, ఆ బృందంలో రమేశ్ ఒకరని వివరించింది.

రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం, యూరోపియన్ స్పేస్ ఆపరేషన్స్ సెంటర్ జర్మనీలోని డర్మ్‌స్టడ్ట్‌‌లో ఉంది. కౌరోవ్, గూన్‌హిల్లీ, న్యూ నోర్షియాలలో ఉన్న గ్రౌండ్ స్టేషన్ల ద్వారా చంద్రయాన్-3కి అవసరమైన సహకారాన్ని అందిస్తోంది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్‌ను ఈ స్టేషన్లు ట్రాక్ చేస్తున్నాయి.

చంద్రయాన్-3 చంద్రునిపై అడుగు పెట్టబోతున్న తరుణంలో ముంబై పోలీసులు బ్యాండ్‌ను వాయించి ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ)కు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రో మాజీ డైరెక్టర్ డాక్టర్ సురేంద్ర పాల్ మాట్లాడుతూ, చంద్రయాన్-3 విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రయాన్-2 నేర్పిన పాఠాలతో దీనిలో అనేక మార్పులు చేశారని చెప్పారు.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, రోదసీ రంగంలో భారత దేశం గొప్ప ముందడుగు వేసిందని చెప్పారు. చంద్రయాన్-3 సున్నితంగా చంద్రునిపైకి దిగితే గొప్ప మార్పులు వస్తాయని తెలిపారు.


ఇవి కూడా చదవండి :

Chandrayaan-3 : చంద్రునిపై భారత్ జయకేతనం ఎగురవేయాలంటూ కోట్లాది మంది పూజలు

Chandrayaan-3 : గతంలో ఇస్రోను ఎగతాళి చేసిన పాకిస్థానీ నేత, ఇప్పుడు ఏమంటున్నారంటే..

Updated Date - 2023-08-23T16:41:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising