ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Donald Trump : పదవి దిగిపోయాక కీలక పత్రాలు ఇంటికి తీసుకెళ్లి దాచిపెట్టుకున్న ట్రంప్.. కేసు నమోదు..

ABN, First Publish Date - 2023-06-10T10:25:26+05:30

డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగి, వైట్ హౌస్ నుంచి వెళ్లిపోయే ముందు అనేక ప్రభుత్వ రహస్య పత్రాలను తనతోపాటు తన నివాసానికి తీసుకెళ్లిపోయారని

Donald Trump
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగి, వైట్ హౌస్ నుంచి వెళ్లిపోయే ముందు అనేక ప్రభుత్వ రహస్య పత్రాలను తనతోపాటు తన నివాసానికి తీసుకెళ్లిపోయారని ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ కేసు నమోదు చేశారు. వేలాది మంది హాజరయ్యే సోషల్ ఈవెంట్స్ జరిగే చోట భద్రత లేకుండా వీటిని పడేశారని ఆరోపించారు. వీటిలో పెంటగాన్, సీఐఏ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలకు సంబంధించిన పత్రాలు ఉన్నట్లు తెలిపారు.

డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌ను వదిలిపెట్టిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన అనేక అత్యంత రహస్య పత్రాలను తన నివాసానికి తీసుకెళ్లిపోయారని ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ 49 పేజీల ఛార్జిషీటులో ఆరోపించారు. అణ్వాయుధ, రక్షణ రంగాలకు సంబంధించిన రహస్య పత్రాలను ఆయన ఫ్లోరిడాలోని తన మర్-ఏ-లగో నివాసానికి తరలించారని తెలిపారు. వేలాది మంది అతిథులు పాల్గొనే సోషల్ ఈవెంట్స్ జరిగే చోట వీటిని ఎటువంటి రక్షణ లేకుండా పడేశారని తెలిపారు.

న్యూజెర్సీలోని బెడ్‌మినిస్టర్‌లో ఉన్న గోల్ఫ్ క్లబ్‌లో కొందరు వ్యక్తులకు అమెరికా మిలిటరీ ఆపరేషన్స్, ప్లాన్స్‌కు సంబంధించిన రహస్య పత్రాలను ఆయన చూపించారని తెలిపారు. ఈ పత్రాలను చూడటానికి ఆ వ్యక్తులకు అనుమతి లేదన్నారు.

అమెరికా చరిత్రలో ఓ మాజీ దేశాధ్యక్షుడు ఫెడరల్ క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటుండటం ఇదే మొదటిసారి. ట్రంప్‌‌‌పైన మొత్తం 37 ఆరోపణలను నమోదు చేశారు. వీటిలో 31 ఆరోపణల్లో ఆయన ఉద్దేశపూర్వకంగానే నేషనల్ డిఫెన్స్ ఇన్ఫర్మేషన్‌ను తన వద్ద ఉంచుకున్నారని పేర్కొన్నారు. వీటిలో ఒక్కొక్క ఆరోపణకు పదేళ్ళ జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.

స్పెషల్ కౌన్సెల్ జాక్ స్మిత్ మాట్లాడుతూ, దేశంలో చట్టాలు అందరికీ సమానంగా వర్తిస్తాయన్నారు. దేశ రక్షణ సమాచారాన్ని పరిరక్షించే చట్టాలు అమెరికా భద్రత, రక్షణలకు చాలా ముఖ్యమైనవన్నారు. వీటిని కచ్చితంగా అమలు చేయాలన్నారు. ట్రంప్‌పైన సత్వర, వేగవంతమైన విచారణ జరిగేలా చూస్తానని చెప్పారు.

న్యాయ ప్రక్రియను అడ్డుకునేందుకు కుట్ర పన్నినట్లు కూడా ట్రంప్‌పై ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలు రుజువైతే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఏదైనా డాక్యుమెంట్ లేదా రికార్డును అక్రమంగా ఉంచుకున్నందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు.

ట్రంప్ వ్యక్తిగత సహాయకుడు వాల్ట్ నౌటాపై కూడా సహ కుట్రదారుగా ఆరోపణలు నమోదయ్యాయి. రహస్య పత్రాలను బాల్‌రూమ్, బాత్రూమ్, బెడ్రూమ్, స్టోరేజ్ రూమ్‌లలో దాచి పెట్టడంలో వాల్ట్ సహకరించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి.

అమెరికాతోపాటు ఇతర దేశాల రక్షణ రంగానికి, ఆయుధాల సామర్థ్యానికి సంబంధించిన పత్రాలను ట్రంప్ పట్టుకెళ్లినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. వీటిని అనధికారికంగా బయటపెట్టడం వల్ల దేశ భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉందని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. అదేవిధంగా విదేశాలతో సంబంధాలపై కూడా ప్రభావం పడుతుందని తెలిపారు.

మియామీ కోర్టుకు ట్రంప్

ఈ కేసులో మొదటి విచారణకు ట్రంప్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు హాజరవుతారు. అయితే ఈ కేసును విచారించే న్యాయమూర్తి అయిలీన్ కెనన్ (42)ను గతంలో ట్రంప్ నియమించారు. 2022 ఆగస్టులో మర్-ఏ-లగో నివాసంపై ఎఫ్‌బీఐ దాడి చేసినపుడు ట్రంప్‌నకు అనుకూలంగా ఈ జడ్జి రూలింగ్స్ ఇచ్చారు. ఈ కేసులో విచారణ ప్రారంభమవడానికి చాలా కాలం పడుతుంది. దీనివల్ల అమెరికా అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ పడటానికి ట్రంప్‌నకు ఆటంకాలేమీ ఉండవు.

‘అవినీతి ప్రభుత్వం ఇరికించింది’

ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో ఈ ఆరోపణలపై స్పందించారు. అవినీతిలో కూరుకుపోయిన, నిజాయితీలేని జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తనను ఈ కేసులో ఇరికించిందని ఆరోపించారు. తాను అమాయకుడినని చెప్తూ ఓ వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో జస్టిస్ డిపార్ట్‌మెంట్ జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. దీని వెనుక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రమేయం ఉందని మండిపడ్డారు. ఎన్నికల్లో బైడెన్ కన్నా తాను ముందంజలో ఉన్నందువల్లే తనను వెంటాడుతున్నారన్నారు.

ఇవి కూడా చదవండి :

Udayanidhi: సీఎం కొడుకు, ఇప్పుడు మంత్రి కూడా అయిన ఉదయనిధి ఆసక్తికర వ్యాఖ్యలు.. నాకు ఉప ముఖ్యమంత్రి పదవా... తెలియదే!

Amazon rainforest : కూలిన విమానం.. గల్లంతైన నలుగురు బాలలు.. 40 రోజుల తర్వాత సజీవంగా..

Updated Date - 2023-06-10T10:37:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising