ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

72 గంటల్లో 54 మంది చావులు.. అసలు ఈ జిల్లాలో ఏం జరుగుతోంది..?

ABN, First Publish Date - 2023-06-19T12:44:03+05:30

యూపీలోని బల్లియా జిల్లాలో 3 రోజుల వ్యవధిలో 54 మంది ప్రాణాలు కోల్పోగా.. 400 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఈ మరణాలకు గల కారణాలపై అధికారులు భిన్న వివరణలు ఇచ్చారు. తూర్పు ఉత్తరపరదేశ్ జిల్లాలోని ప్రభుత్వ వైద్యులు ఈ మరణాలకు అధిక ఉష్ణోగ్రతలే కారణమై ఉండొచ్చని చెప్పారు. అయితే ఈ మరణాలకు కారణాలు తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ఇన్‌చార్జ్, లక్నోకు చెందిన సీనియర్ ప్రభుత్వ వైద్యుడు ఏకే సింగ్.. మరణాలకు అధిక ఉష్ణోగ్రతలే కారణమనే విషయాన్ని తోసిపుచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: పెరిగిన అధిక ఉష్ణోగ్రతల మధ్య ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో 3 రోజుల వ్యవధిలో 54 మంది ప్రాణాలు కోల్పోగా.. 400 మంది ఆసుపత్రుల పాలయ్యారు. జూన్ 15న 23 మంది చనిపోగా.. 16న 20 మంది, 17న 11 మంది చనిపోయారు. అయితే ఈ మరణాలకు గల కారణాలపై అధికారులు భిన్న వివరణలు ఇచ్చారు. మొదటగా తూర్పు ఉత్తరపరదేశ్ జిల్లాలోని ప్రభుత్వ వైద్యులు ఈ మరణాలకు అధిక ఉష్ణోగ్రతలే కారణమై ఉండొచ్చని చెప్పారు. అయితే ఈ మరణాలకు కారణాలు తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ఇన్‌చార్జ్, లక్నోకు చెందిన సీనియర్ ప్రభుత్వ వైద్యుడు ఏకే సింగ్.. మరణాలకు అధిక ఉష్ణోగ్రతలే కారణమనే విషయాన్ని తోసిపుచ్చారు.

ఏకే సింగ్ మాట్లాడుతూ ‘‘ ప్రాథమికంగా ఇవి అధిక ఉష్ణోగ్రతల వల్ల సంభవించిన మరణాలుగా కనిపించడం లేదు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులే బల్లియా సమీప జిల్లాలోనూ ఉన్నాయి. కానీ అక్కడ ఇలాంటి మరణాలు నమోదు కాలేదు. చనిపోయిన వారిలో ఎక్కువ మందికి మొదట ఛాతిలో నొప్పి వచ్చింది. కానీ అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రభావితమైన వారిలో ఛాతిలో నొప్పి రావడం మొదటి లక్షణం కాదు. అయితే ఈ మరణాలు నీటి వల్ల ఏమైనా సంభవించాయా లేదా ఇంకేమైనా కారణం ఉందా అనేది తేలడానికి దర్యాప్తు చేస్తాం. వాతావరణ విభాగం కూడా నీటి నమూనాలను తనిఖీ చేయడానికి వస్తోంది’’ అని ఆయన చెప్పారు.

అంతకుముందు రోజు బల్లియా చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ ర్యాంక్ వైద్యుడు చాలా మరణాలు వడదెబ్బ కారణంగానే సంభవించాయని ప్రకటించాడు. దీంతో ఆ ప్రకటన వైరల్‌గా మారింది. అయితే సరైన సమాచారం లేకుండా అధిక ఉష్ణోగ్రతల వల్ల సంభవించే మరణాలపై నిర్లక్ష్యంగా ప్రకటన చేసినందుకు సదరు వైద్యుడిని విధుల నుంచి తొలగించినట్లు యూపీ ఆరోగ్య మంత్రి బ్రజేష్ పాఠక్ తెలిపారు. అంతేకాకుండా బల్లియాలో జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, అక్కడి పరిస్థితిని తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని బ్రజేష్ పాఠక్ చెప్పారు.

అయితే ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, సమాజ్‌వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అధిక ఉష్ణోగ్రతల గురించి ప్రభుత్వం ముందుగానే ప్రజలను హెచ్చరించాలి. గత 6 సంవత్సరాల్లో యూపీలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి కూడా నిర్మించలేదు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది పేద రైతులే ఉన్నారు. ఎందుకంటే వారికి సరైన సమయంలో ఆహారం, మందులు, వైద్యం అందలేదు.’’ అని అఖిలేష్ యాదవ్ అన్నారు.

ప్రస్తుతం బల్లియా జిల్లాలో రోగుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అందరికీ స్ట్రెచర్లు కూడా దొరకడం లేదు. చాలా మంది అటెండర్లు రోగులను తమ భుజాలపై మోసుకుంటూ అత్యవసర వార్డులకు తీసుకెళ్తున్నారు.

Updated Date - 2023-06-19T12:44:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising