ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రేవా వర్సిటీలో ఫిల్మ్‌ స్టడీస్‌ కోర్సులు

ABN, First Publish Date - 2023-06-22T04:17:41+05:30

దక్షిణ భారతదేశంలో పేరొందిన విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన రేవా యూనివర్సిటీ–బెంగళూరు.. డిగ్రీ స్థాయిలో వినూత్న కోర్సులను ప్రవేశపెట్టింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే

అడాప్టివ్‌ లెర్నింగ్‌ కోర్సుల వివరాలు వెల్లడిస్తున్న చాన్స్‌లర్‌ శ్యామరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యార్థుల కోసం అడాప్టివ్‌ లెర్నింగ్‌: చాన్స్‌లర్‌ శ్యామరాజు

బెంగళూరు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): దక్షిణ భారతదేశంలో పేరొందిన విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన రేవా యూనివర్సిటీ–బెంగళూరు.. డిగ్రీ స్థాయిలో వినూత్న కోర్సులను ప్రవేశపెట్టింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ఫిల్మ్‌ స్టడీస్‌, మనోధార పేరిట కొత్త కోర్సులను ఆరంభిస్తున్నట్లు వర్సిటీ చాన్స్‌లర్‌ శ్యామరాజు వెల్లడించారు. కొత్త కోర్సుల ప్రారంభం నేపథ్యంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సులను ఎంపిక చేసుకుని, భవిష్యత్తును రూపొందించుకునేలా అడాప్టివ్‌ లెర్నింగ్‌ (అనుకూల అభ్యాసము) విధానాన్ని ప్రవేశ పెట్టామన్నారు. ఫిల్మ్‌ స్డడీస్‌లో భాగంగా డాక్యుమెంటరీ ప్రొడక్షన్‌, ఆడియో విజువల్‌ ప్రొడక్షన్‌, ఫిల్మ్‌ అప్రెసియేషన్‌ వంటి కోర్సులు ఉంటాయన్నారు. స్కూల్‌ ఆఫ్‌ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌లో భాగంగా స్పోర్ట్స్‌ సైన్స్‌లో బీఎస్సీ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టామన్నారు. మానసిక, శారీరక శక్తిని పెంచుకునేందుకు మనోధార కోర్సు ఉపయోగపడుతుందన్నారు. అలాగే, టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేషన్‌ లో భాగంగా రేవా నెస్ట్‌ కోర్సును సైతం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రేవాలో ఉన్నత విద్య పూర్తి చేసే ప్రతి విద్యార్థి 2030 నాటికి ఉద్యోగాల కల్పించే స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దుతామన్నారు. వీటితో పాటు వ్యవసాయంలో ఆధునికీకరణ దిశగా కోర్సులు ఆరంభిస్తున్నామని చెప్పారు. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు ద్వారా విద్యార్థులు.. తమ భవిష్యత్తును ఉత్తమంగా రూపొందించుకునే వీలుంటుందన్నారు. రేవా బిజినెస్‌ స్కూల్‌ విద్యార్థి దీపక్‌ కుమార్‌సింగ్‌ రూ.50లక్షల ప్యాకేజీతో పాలో ఆల్టో నెట్‌వర్క్‌ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యారని వెల్లడించారు. కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ ధనుంజయ్‌, ఉమేష్‌ ఎస్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-22T04:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising