కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Fathima Biwi No More : సుప్రీం కోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఫాతిమా బీవీ కన్నుమూత

ABN, First Publish Date - 2023-11-24T06:12:10+05:30

సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఫాతిమా బీవీ (96) కన్నుమూశారు. కేరళలోని కొల్లాంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస ..

Fathima Biwi No More : సుప్రీం కోర్టు తొలి మహిళా న్యాయమూర్తి  జస్టిస్‌ ఫాతిమా బీవీ కన్నుమూత

కొల్లాం, నవంబరు 23: సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఫాతిమా బీవీ (96) కన్నుమూశారు. కేరళలోని కొల్లాంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆమె తమిళనాడు గవర్నర్‌గా కూడా పనిచేశారు. జస్టిస్‌ ఫాతిమా బీవీ.. 1927 ఏప్రిల్‌ 30న కేరళలోని పథనంతిట్టలో జన్మించారు. తండ్రి ప్రోత్సాహంతో న్యాయవాద విద్య అభ్యసించారు. 1950లో కేరళ బార్‌ కౌన్సిల్‌ పరీక్షలో బంగారు పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పారు. కేరళలో న్యాయవాద వృత్తి చేపట్టిన ఆమె మున్సి్‌ఫగా, సబార్డినేట్‌ జడ్జిగా, చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌గా పనిచేసి 1974లో జిల్లా సెషన్స్‌ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 1980లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లో జ్యుడిషియల్‌ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు. 1983లో హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1989లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితురాలై కొత్త చరిత్ర లిఖించారు. 1992లో పదవీ విరమణ చేసిన తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యురాలిగా పనిచేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆమెకు నివాళి అర్పించారు.

Updated Date - 2023-11-24T06:12:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising