ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

First JN.1 Case: ఢిల్లీలో తొలి జేఎన్.1 వేరియంట్ కోవిడ్ కేసు నమోదు

ABN, Publish Date - Dec 29 , 2023 | 10:45 AM

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 797 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఐదుగురు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు భారత్‌లో 4,097 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 797 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఐదుగురు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు భారత్‌లో 4,097 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 55, ఏపీలో 29 యక్టీవ్ కేసులు ఉన్నట్లు సమాచారం.

కేరళలో ఇద్దరు, మహరాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కొక్కరు మరణించారు. ఏపీలో 25, తెలంగాణలో 9 కోవిడ్ కొత్త కేసులు నమోదు కాగా ఏపీలో 54, తెలంగాణలో 64 యక్టీవ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో తొలి జేఎన్.1 వేరియంట్ కోవిడ్ కేసు నమోదయింది.

కాగా దేశంలో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు 157కు పెరిగాయని ఇన్సాకాగ్‌ గురువారం వెల్లడించింది. వీటిలో కేరళలో 78, గుజరాత్‌ 34, గోవాలో18, కర్ణాటకలో 8, మహారాష్ట్రలో 7, రాజస్థాన్‌లో 5, తమిళనాడులో 4, తెలంగాణలో 2, ఢిల్లీలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయని తెలిపింది. వీటిలో డిసెంబరులో 141 కేసులు నమోదు కాగా, నవంబరులోనే 16 నమోదయ్యాయని పేర్కొంది. మరోవైపు దేశంలో ఒక్కరోజులో 702 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కొవిడ్‌తో ఆరుగురు మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. వీటిలో మహారాష్ట్ర నుంచి రెండు, కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ నుంచి ఒక్కొక్కటి చొప్పున మరణాలు సంభవించాయి.

Updated Date - Dec 29 , 2023 | 10:45 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising