ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Elections: వొక్కలిగ సామాజిక వర్గంలో తిరుగులేని నేతలు..

ABN, First Publish Date - 2023-05-03T14:31:39+05:30

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించే స్థితిలో వొక్కలిగ సామాజిక వర్గం ఉంది. ఈ సామాజిక వర్గం నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించే స్థితిలో వొక్కలిగ సామాజిక వర్గం ఉంది. ఈ సామాజిక వర్గం నుంచి రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేతల్లో ఐదుగురు ప్రముఖులు ఈనెల 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటుకునేందుకు పూర్తి శక్తియుక్తులు కేంద్రీకరిస్తున్నారు. వ్యక్తిగత గెలుపునే కాకుండా, పార్టీ గెలుపును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీ పడుతున్న ఈ నేతల గురించి ఒకసారి చూస్తే..

1.డీకే శివకుమార్

వొక్కలిగ సామాజిక వర్గంలో గట్టి పేరున్న డీకే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఉన్నారు. ఇంతవరకూ ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో కనకపుర నియోజకవర్గం నుంచి డీకే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ దిద్గజ నేతల్లో ఒకరైన డీకే 2008 నుంచి ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచారు.

2.హెచ్‌డీ కుమారస్వామి

జనతాదళ్ (సెక్యులర్) నేత అయిన హెచ్‌డీ కుమారస్వామి రెండు సార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు. దక్షిణ కర్ణాటలో బలమైన వొక్కలిక సామాజిక వర్గానికి చెందిన నేత. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నపట్న నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సీపీ యోగేశ్వర నుంచి ఆయన ఈసారి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.

3. ఆర్.అశోక

బీజేపీకి చెందిన సీనియర్ మంత్రి అశోక. ప్రముఖ వొక్కలిగ నేత. బెంగళూరులోని పద్మనాభనగర్ నుంచి మరోసారి గెలిచేందుకు ఆయన పోటీ పడుతున్నారు.

4.హెచ్‌డీ రేవణ్ణ

జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీలో గట్టి పేరున్న నేత హెచ్‌డీ రేవణ్ణ. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ తనయుడు. హోలెనర్సిపుర నియోజవర్గం నుంచి ఆయన పోటీలో ఉన్నారు. 1994 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. హోలెనర్సిపుర నుంచి ఆయన గెలుపు, ఓటములను కూడా చవిచూశారు. 2004 తన సోదరుడు హెచ్‌డీ కుమారస్వా్మి ప్రభుత్వంలో మంత్రిగా రేవణ్ణ పనిచేశారు.

5.జీటీ దేవెగౌడ

వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన బలమైన జేడీఎస్ నేతల్లో జీటీ దేవెగౌడ ఒకరు. 2018 ఎన్నికల్లో ఆయన సిట్టింగ్ సీఎం సిద్ధరామయ్యపై చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ ఆధిక్యంతో గెలుపొందటం విశేషం. చాముండేశ్వరి నియోజకవర్గం మొదట్నించీ పోటీ కాంగ్రెస్, జేడీఎస్‌ మధ్యే ఉంటోంది. తొలిసారి ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది.

Updated Date - 2023-05-03T14:47:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising