Jaishankar: బీబీసీ డాక్యుమెంటరీపై జైశంకర్ స్పందన
ABN, First Publish Date - 2023-02-21T22:27:03+05:30
బీబీసీ డాక్యుమెంటరీ (BBC documentary) వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) స్పందించారు.
న్యూఢిల్లీ: బీబీసీ డాక్యుమెంటరీ (BBC documentary) వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) స్పందించారు. డాక్యుమెంటరీ యాదృశ్చికంగా చేసింది కాదని, రాజకీయ కారణాలతోనే చేశారని ఘాటుగా విమర్శించారు. రాజకీయాలు విదేశాల నుంచి కూడా జరుగుతాయని, రాజకీయాల్లో తలపడలేని కొందరు మీడియా ముసుగులో ఇలాంటి పనులు చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రజలు ఇలాంటి వీడియోలను నమ్మబోరని, ప్రజాతీర్పు తమ ప్రభుత్వానికి అనుకూలంగా రాబోతోందని జై శంకర్ స్పష్టం చేశారు.
2002లో గుజరాత్ అల్లర్లు జరిగినపుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీని (Narendra Modi) కేంద్రంగా చేసుకుని ఇటీవల బీబీసీ విడుదల చేసిన రెండు విభాగాల డాక్యుమెంటరీ రాజకీయ దుమారం సృష్టించింది.
Updated Date - 2023-02-21T22:28:58+05:30 IST