Infosys Vs Tech Mahindra: ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా ఉద్యోగులకు బిగ్ న్యూసే ఇది!
ABN, First Publish Date - 2023-03-11T16:07:41+05:30
ఇన్ఫోసిస్ (Infosys) మాజీ ప్రెసిడెంట్ మోహిత్ జోషీ (Mohit Joshi) శనివారం టెక్ మహీంద్రా (Tech Mahindra) మేనేజింగ్ డైరెక్టర్ అండ్
న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ (Infosys) మాజీ ప్రెసిడెంట్ మోహిత్ జోషీ (Mohit Joshi) శనివారం టెక్ మహీంద్రా (Tech Mahindra) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమితులయ్యారు. టెక్ మహీంద్రా ఈ విషయాన్ని శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. డిసెంబరు 19న పదవీ విరమణ చేయబోతున్న సీపీ గుర్నానీ బాధ్యతలను జోషీ చేపడతారని తెలిపింది.
మోహిత్ జోషీ టెక్ మహీంద్రాలో చేరుతున్నారని ఈ రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది. ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్, కన్సల్టింగ్ స్పేస్‌లో జోషీకి రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉందని తెలిపింది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నిర్వహణ, వ్యాపారాల అభివృద్ధి కోసం ప్రపంచంలో అతి పెద్ద కార్పొరేషన్లలో ఆయన పని చేశారని పేర్కొంది. జోషీ ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేసిన తర్వాత టెక్ మహీంద్రా ఈ ప్రకటన చేసింది. సీపీ గుర్నానీ ఈ ఏడాది డిసెంబరు 19న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో అంతకుముందే జోషీ తమ కంపెనీలో చేరుతారని, తమ కంపెనీలో పరిస్థితులను అర్థం చేసుకోవడానికి తగిన సమయం ఉండే విధంగా చేరుతారని తెలిపింది.
మోహిత్ జోషీ గురించి...
ఇన్ఫోసిస్ వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, మోహిత్ జోషీ ఆ కంపెనీలో ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్/లైఫ్ సైన్సెస్ బిజినెసెస్‌ను పర్యవేక్షించారు. 2000వ సంవత్సరంలో ఆయన ఇన్ఫోసిస్‌లో చేరారు. అప్పటి నుంచి అనేక రకాల పాత్రలను పోషించారు. ఎడ్గెవెర్వ్ సిస్టమ్స్ లిమిటెడ్ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. ఇన్ఫోసిస్‌కు చెందిన గ్లోబల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఫినకిల్ (Finacle) సహా సాఫ్ట్‌వేర్ బిజినెస్‌కు నాయకత్వం వహించారు.
ఆయన ఏఎన్‌జెడ్ గ్రిండ్లేస్, ఏబీఎన్ అమ్రోలలో కూడా పని చేశారు. కాన్ఫడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీకి చెందిన ఎకనమిక్ గ్రోత్ బోర్డ్ వైస్ చైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ సభ్యుడు కూడా.
జోషీ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చరిత్రలో డిగ్రీ చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేశారు.
ఇవి కూడా చదవండి :
Kavitha ED Enquiry Live Updates: కవిత ఈడీ విచారణ మొదలై ఎన్ని గంటలైందంటే..
CBI Vs RJD : తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు... సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు...
Updated Date - 2023-03-11T16:07:41+05:30 IST