Chandrayaan-3 : గతంలో ఇస్రోను ఎగతాళి చేసిన పాకిస్థానీ నేత, ఇప్పుడు ఏమంటున్నారంటే..
ABN, First Publish Date - 2023-08-23T13:12:27+05:30
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)ను గతంలో ఎగతాళి చేసిన పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవద్ చౌదరి ప్రస్తుతం ప్రశంసిస్తున్నారు. చంద్రయాన్-3 కార్యక్రమం యావత్తు మానవాళికి చరిత్రాత్మక సమయమని అభివర్ణిస్తున్నారు. చంద్రయాన్-2 సమయంలో ఇస్రోను ఆయన ఎగతాళి చేశారు.
ఇస్లామాబాద్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)ను గతంలో ఎగతాళి చేసిన పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవద్ చౌదరి ప్రస్తుతం ప్రశంసిస్తున్నారు. చంద్రయాన్-3 కార్యక్రమం యావత్తు మానవాళికి చరిత్రాత్మక సమయమని అభివర్ణిస్తున్నారు. చంద్రయాన్-2 సమయంలో ఇస్రోను ఆయన ఎగతాళి చేశారు. ప్రస్తుతం చంద్రయాన్-3 దూసుకెళ్తుండటంతో భారతీయ శాస్త్రవేత్తలను, రోదసీ రంగంలో కృషి చేస్తున్నవారినందరినీ ఆయన అభినందించారు. విమర్శకుల నుంచి, మరీ ముఖ్యంగా శత్రువుల నుంచి ప్రశంసలు రావడం ఎంతో గొప్ప విశేషం!
పాకిస్థాన్ సమాచార, ప్రసార శాఖల మాజీ మంత్రి ఫవద్ చౌదరి ఇచ్చిన ట్వీట్‌లో, చంద్రయాన్-3ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని పాకిస్థాన్ మీడియా సంస్థలను కోరారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6.15 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరారు. ఇది మానవాళికి చరిత్రాత్మక సమయమని తెలిపారు. మరీ ముఖ్యంగా భారతీయులకు, శాస్త్రవేత్తలకు, స్పేస్ కమ్యూనిటీకి ఇది చరిత్రాత్మక ఘడియ అని చెప్పారు. అందరికీ అభినందనలు తెలిపారు.
ఇదిలావుండగా, ఫవద్ చౌదరి గత నెలలో ఓ టీవీ చర్చలో మాట్లాడుతూ భారత దేశం నిర్వహిస్తున్న చంద్రయాన్ కార్యక్రమాలను ఎగతాళి చేశారు. ‘‘ఇలాంటి ప్రయత్నాలు అవసరం లేదు. చంద్రుడు కనిపిస్తాడు. అది ఎంత దూరంలో ఉందో తెలుసు. అది ఏ ప్రాంతంలో ఉందో కూడా తెలుసు’’ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో కనిపించింది. మన కృషి విజయవంతమవుతుండటంతో ఆయన మాట మార్చి అకస్మాత్తుగా ప్రశంసించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే నెటిజన్లు ఆయనను వదిలిపెట్టలేదు. భారత దేశం అంటే ఎందుకంత అయిష్టత అంటూ కడిగిపారేస్తున్నారు.
చంద్రయాన్-3 విజయవంతంగా బుధవారం సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై అడుగు పెడుతుందని ఇస్రో ధీమా వ్యక్తం చేస్తోంది. శాస్త్రవేత్తలు కంటి మీద రెప్పవాల్చకుండా అహర్నిశలు శ్రమిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Chandrayaan-3: పాఠశాలల్లో చంద్రయాన్ 3ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు.. కానీ..
Chandrayaan-3 : చంద్రునిపై భారత్ జయకేతనం ఎగురవేయాలంటూ కోట్లాది మంది పూజలు
Updated Date - 2023-08-23T13:12:27+05:30 IST