ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bathinda: మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు...నలుగురి మృతి

ABN, First Publish Date - 2023-04-12T10:35:30+05:30

పంజాబ్ రాష్ట్రంలోని భటిండా మిలటరీ స్టేషనులో బుధవారం జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది....

FIring inside military station
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భటిండా : పంజాబ్ రాష్ట్రంలోని భటిండా మిలటరీ స్టేషనులో బుధవారం జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. భటిండా మిలిటరీ స్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు.(Bathinda)మిలిటరీ స్టేషన్‌లో కాల్పుల ఘటన తర్వాత స్టేషన్ క్విక్ రియాక్షన్ టీమ్‌లు అప్రమత్తం అయ్యాయి.మిలిటరీ స్టేషన్‌లో తెల్లవారుజామున 4:35 గంటలకు కాల్పులు(Firing inside military station) జరిగినట్లు సమాచారం.ఈ కాల్పుల్లో నలుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. ఈ ఘటన ఉగ్రదాడి కాదని(Not a terror attack) పంజాబ్ ఎస్‌ఎస్పీ తెలిపారు.

భటిండా కాల్పుల ఘటన ఉగ్ర దాడి కాదని, ఇది సోదరుల హత్య కేసుగా భావిస్తున్నామని ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారు.మిలిటరీ స్టేషన్‌లోని అధికారుల మెస్‌లో ఈ ఘటన జరిగింది.కాల్పులు జరిగిన ప్రాంతాన్ని చుట్టుముట్టి సీల్ చేశామని,గాలింపు కొనసాగుతుందని ఆర్మీ హెచ్‌క్యూ సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇది కూడా చదవండి : First Rapid Rail: ఢిల్లీ-మీరట్ మొట్టమొదటి రాపిడిక్స్ రైలు...ఎన్‌సీఆర్‌టీసీ ప్రకటన

మిలటరీ స్టేషనులో ఏదో జరిగిందని, కానీ ఆర్మీ అంతర్గత విషయాలను తాము బయటపెట్టలేమని భటిండా ఎస్పీ గుల్నీత్ సింగ్ ఖురానా చెప్పారు. రెండు రోజుల క్రితం స్టేషన్‌లోని ఆర్టిలరీ యూనిట్‌లో కొన్ని ఆయుధాలు మాయమైనట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. తప్పిపోయిన ఈ ఆయుధాల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని సైనిక వర్గాలు తెలిపాయి.

Updated Date - 2023-04-12T10:35:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising