ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

G20 Summit : జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం

ABN, First Publish Date - 2023-09-09T13:22:50+05:30

ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20 దేశాల కూటమిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగల దేశాలు కలిసి జీ20గా 1999లో ఏర్పాటయ్యాయి.

న్యూఢిల్లీ : ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20 దేశాల కూటమిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగల దేశాలు కలిసి జీ20గా 1999లో ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత ఈ కూటమిలో ఇతర దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించలేదు. జీ20 సమావేశాలు శని, ఆదివారాల్లో న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న సంగతి తెలిసిందే.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం మాట్లాడుతూ, అందరితో కలిసి (సబ్‌కా సాథ్) అనే భావానికి అనుగుణంగా ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత దేశం ప్రతిపాదిస్తోందని తెలిపారు. ఈ ప్రతిపాదనను అందరూ అంగీకరిస్తారని నమ్ముతున్నానని చెప్పారు. ‘‘మీ అంగీకారంతో...’’ అని చెప్తూ, జీ20లోకి ఆఫ్రికన్ యూనియన్‌ ప్రవేశించినట్లు తెలియజేస్తూ, ఆయన ఓ చిన్న సుత్తితో మూడుసార్లు కొట్టారు. ‘‘మనం పని ప్రారంభించే ముందు, శాశ్వత సభ్యునిగా తన స్థానాన్ని స్వీకరించవలసినదిగా ఆఫ్రికన్ యూనియన్ ప్రెసిడెంట్‌ను ఆహ్వానిస్తున్నాను’’ అని చెప్పారు.

అనంతరం విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ప్రస్తుత ఆఫ్రికన్ యూనియన్ చైర్‌పర్సన్, కొమొరోస్ ప్రెసిడెంట్ అజలి అసౌమనిని సాదరంగా ఆయనకు కేటాయించిన ఆసనం వద్దకు తీసుకొచ్చారు. అసౌమనిని మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, స్వాగతం పలికారు.

ఆఫ్రికన్ యూనియన్ 2002లో ప్రారంభమైంది. దీనిని జీ20లో చేర్చుకోవడం గురించి ప్రస్తుత జీ20 దేశాల నేతల సమావేశం ముసాయిదా ప్రకటనలో చేర్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కూటమిలో యూరోపియన్ యూనియన్‌కు జీ20లో సభ్యత్వం ఉంది. 27 దేశాల యూరోపియన్ యూనియన్‌తో సమాన హోదాను ఆఫ్రికన్ యూనియన్‌కు కల్పించారు. ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత సభ్యత్వం పొందినప్పటికీ జీ20 పేరులో మార్పు ఉండబోదని తెలుస్తోంది.

ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో సంపూర్ణ సభ్యత్వం ఇవ్వాలని మోదీ జూన్‌లో ఈ కూటమిలోని దేశాలకు లేఖలు రాశారు. ఈ ప్రతిపాదనను వేర్వేరు కారణాలతో ఈయూ, చైనా, రష్యా సమర్థించాయి.


ఇవి కూడా చదవండి :

Chandrababu Arrest : ఎఫ్ఐఆర్‌లో పేరు లేదు.. ఎందుకు అరెస్టో తెలియదు.. ఇదే రాజారెడ్డి రాజ్యాంగం: నారా లోకేష్

Chandra Babu Arrest : చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి

Updated Date - 2023-09-09T13:22:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising