ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

G20 Summit: జీ20 సభ్యత్వం గ్లోబల్ సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.. ఆఫ్రికన్ యూనియన్ లీడర్ ట్వీట్

ABN, First Publish Date - 2023-09-09T19:19:35+05:30

ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20 కూటమిలో శాశ్వత సభ్యత్వం లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏయూ (AU) కమిషన్ హెడ్ మౌసా ఫకి మహమత్ స్పందిస్తూ.. ఈ సభ్యత్వం గ్లోబల్ సవాళ్లను...

ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20 కూటమిలో శాశ్వత సభ్యత్వం లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏయూ (AU) కమిషన్ హెడ్ మౌసా ఫకి మహమత్ స్పందిస్తూ.. ఈ సభ్యత్వం గ్లోబల్ సవాళ్లను ఎదుర్కోవడంలో తమకు సహాయపడుతుందని అన్నారు. ‘‘జీ20లో శాశ్వత సభ్యునిగా ఆఫ్రికన్ యూనియన్ ప్రవేశాన్ని నేను స్వాగతిస్తున్నాను. దీర్ఘకాలం నుంచి తాము వాదిస్తున్న ఈ సభ్యత్వం.. మా ఖండానికి ప్రపంచంలో తనదైన ముద్ర వేయడంలో సహాయపడుతుంది. అలాగే.. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రభావవంతమైన సహకారం అందిస్తుంది’’ అంటూ ఎక్స్ (ట్విటర్) ప్లాట్‌ఫామ్‌లో ఆయన రాసుకొచ్చారు.


కాగా.. ఆఫ్రికన్ యూనియన్‌లో పూర్తి బలం ఉన్న 55 మంది సభ్యులు ఉన్నాయి. కానీ.. జుంటా-పాలిత దేశాలు మాత్రం సస్పెండ్ చేయబడ్డాయి. 1.4 బిలియన్ (140 కోట్లు) జనాభా కలిగిన ఈ యూనియన్ 3 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగి ఉంది. ఇప్పటివరకూ జీ20 సమూహంలో 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ ఉన్నాయి. ఇది ప్రపంచ జీడీపీలో 85 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్‌కి జీ20 సభ్యత్వం లభించింది. ఈ సందర్భంగా నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ట్విటర్ మాధ్యమంగా.. ‘‘ఒక ఖండంగా, G20 ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి ప్రపంచ వేదికపై మా ఆకాంక్షలను మరింత ముందుకు తీసుకెళ్లాలని మేము ఎదురుచూస్తున్నాము’’ అని రాసుకొచ్చారు.

ఇదిలావుండగా.. 1999లో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు గల దేశాలు కలిసి జీ20గా ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత ఈ కూటమిలో ఇతర దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించలేదు. ఇన్నేళ్ల తర్వాత ఈ కూటమిలో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించారు. ప్రధాన మోదీ శనివారం మాట్లాడుతూ.. అందరితో కలిసి (సబ్‌కా సాథ్) అనే భావానికి అనుగుణంగా ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత్ ప్రతిపాతిస్తోందని, దీన్ని అందరూ అంగీకరిస్తారని నమ్ముతున్నానని చెప్పారు. ‘‘మీ అంగీకారంతో...’’ అని చెప్తూ జీ20లోకి ఏయూ ప్రవేశించినట్లు తెలియజేస్తూ.. ఆయన ఓ చిన్న సుత్తితో మూడుసార్లు కొట్టారు.

Updated Date - 2023-09-09T19:19:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising