ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

G20 Summit : మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జీ20 నేతలు

ABN, First Publish Date - 2023-09-10T11:37:07+05:30

జీ20 దేశాల నేతలు ఆదివారం ఉదయం న్యూఢిల్లీలోని రాజ్‌‌‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. వీరంతా ఖద్దరు శాలువలు ధరించడం విశేషం. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, మహాత్మా గాంధీకి జీ20 కుటుంబ సభ్యులు నివాళులర్పించారని తెలిపారు.

న్యూఢిల్లీ : జీ20 దేశాల నేతలు ఆదివారం ఉదయం న్యూఢిల్లీలోని రాజ్‌‌‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. వీరంతా ఖద్దరు శాలువలు ధరించడం విశేషం. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, మహాత్మా గాంధీకి జీ20 కుటుంబ సభ్యులు నివాళులర్పించారని తెలిపారు. శాంతి, సేవ, కారుణ్యం, అహింసలకు దిక్సూచి మహాత్మా గాంధీ అని చెప్పారు. వైవిద్ధ్యభరితమైన దేశాలు సమావేశమవడంతో, సమ్మిళిత, సౌభాగ్యవంతమైన ప్రపంచ భవిష్యత్తు కోసం మనందరి ఉమ్మడి దార్శనికతను గాంధీజీ ఆదర్శాలు మార్గదర్శనం చేస్తాయన్నారు.

G20 శిఖరాగ్ర సమావేశాలు రెండో రోజైన ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ కూటమిలోని దేశాల నేతలు రాజ్‌ఘాట్ నుంచి భారత మండపానికి చేరుకున్నారు. మద్యాహ్నం 12:30 వరకు భారత మండపంలో ‘ఒకే భవిష్యత్’ అంశంపై చర్చలు జరుపుతారు. వచ్చే ఏడాదికి G20 ప్రెసిడెన్సీని బ్రెజిల్‌ చేపట్టబోతోంది. ఆ దేశానికి అధ్యక్ష బాధ్యతలను భారత్ అప్పగిస్తుంది. ప్రధాని మోదీ మధ్యాహ్నం పలు దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్‌కు మోదీ వర్కింగ్ లంచ్ ఇస్తారు. ఆ తర్వాత కొమొరోస్, తుర్కియే (టర్కీ), యూఏఈ, దక్షిణ కొరియా, యురోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా అధినేతలతో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కీలక అంశాలపై రంగాల వారీగా ఆయా దేశాలతో భారత్ పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి :

CBN Arrest Case : ఏసీబీ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు.. ఏం చెప్పారంటే..?

CID On NCBN Remand Report : చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సీఐడీ ఏయే విషయాలు చెప్పింది.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్ క్లూజివ్

Updated Date - 2023-09-10T11:37:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising