ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gali Janardhan Reddy: 224 నియోజకవర్గాల్లో కేఆర్‌పీపీ పోటీ

ABN, First Publish Date - 2023-01-21T12:37:01+05:30

రాష్ట్రంలోని 224 శాసనసభ నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు కల్యాణ కర్ణాటక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వ్యవస్థాపకుడు గాలి జనార్దన్‌ రెడ్డి

గంగావతి(బెంగళూరు), జనవరి 20 : రాష్ట్రంలోని 224 శాసనసభ నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు కల్యాణ కర్ణాటక ప్రగతి పక్ష వ్యవస్థాపకుడు గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhan Reddy) తెలిపారు. శుక్రవారం గంగావతిలోని కేఆర్‌పీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 224 స్థానాలకు అభ్యర్థులను నిలబెడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి విభాగంలోనూ ప్రచారం నిర్వహించి గెలిచే అభ్యర్థులనే నిలబెడుతున్నట్లు చెప్పారు. హీనపక్షం తమ పార్టీ నుంచి 50 మంది ఎమ్మెల్యేలుగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి రోజూ భారీ సంఖ్యలో కేఆర్‌పీపీలో చేరుతున్నారని వివరించారు. కొప్పాళ జిల్లా కేఆర్‌పీపీ అధ్యక్షుడిగా మనోహర్‌గౌడను, తాలూకా అధ్యక్షుడిగా వీరేష్‌ బలకుందిని ఎన్నుకున్నట్లు తెలిపారు. గ్రామీణ విభాగంలో ప్రతి గ్రామానికి వెళ్లి ప్రచారం నిర్వహించే ప్రచార కమిటీ అధ్యక్షుడిగా హనుమంతప్పను ఎన్నుకున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో కేఆర్‌పీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు సయ్యద్‌ జిలాన్‌ బాషా, దళపతి, వేణు, పరశురామ్‌, ప్రవీణ్‌కుమార్‌, వెంకటేష్‌ నాయక్‌, సురేష్‌ బాబు, విష్ణుబాబు, శ్రీనివాసగౌడ, రమేష్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-21T12:37:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising