Gutka Scam: అన్నాడీఎంకే మాజీ మంత్రుల ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ రవి అనుమతి
ABN, First Publish Date - 2023-11-20T20:29:45+05:30
తమిళనాడులో సంచలన సృష్టించిన గుట్కా స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అన్నాడీఎంకే మాజీ మంత్రులు డాక్టర్ సి.విజయభాస్కర్, బీవీ రమణలను ప్రాసిక్యూట్ చేసేందుకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అనుమతి మంజూరు చేశారు.
పుదుక్కోట: తమిళనాడు (Tamilnadu)లో సంచలన సృష్టించిన గుట్కా స్కామ్ (Gutka Scam) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అన్నాడీఎంకే మాజీ మంత్రులు డాక్టర్ సి.విజయభాస్కర్, బీవీ రమణలను ప్రాసిక్యూట్ చేసేందుకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi) అనుమతి మంజూరు చేశారు. ఈ కేసుపై సీబీఐ విచారణ జరుపుతోంది. మాజీ మంత్రుల ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతించిన విషయాన్ని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎస్.రఘుపతి సోమవారంనాడు తెలిపారు.
ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతించడంతో అన్నాడీఎంకే హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన విజయభాస్కర్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పనిచేసిన రమణపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయనుంది. గుట్కా స్కామ్ అప్పట్లో తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ సమయంలో విపక్ష పార్టీగా ఉన్న డీఎంకే ఈ కుంభకోణంపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది. తాము అధికారంలోకి రాగానే ఈ కేసుపై విచారణ జరిపిస్తామని కూడా హామీ ఇచ్చింది.
Updated Date - 2023-11-20T20:29:46+05:30 IST