ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NDA Meet: బెంగళూరులో ప్రతిపక్షాల భేటీ ముగిసిన కాసేపటికే మోదీ బలప్రదర్శన.. కీలక సమావేశం షురూ

ABN, First Publish Date - 2023-07-18T19:39:47+05:30

బెంగళూరులో ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టుకుని, ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుపై యుద్ధం ప్రకటించిన కొద్దిసేపటికే దేశ రాజధాని న్యూఢిల్లీలో బీజేసీ సారధ్యంలో 38 పార్టీలతో కూడిన ఎన్డీఏ మెగా భేటీ ఆరంభమైంది. భేటీ హాజరైన నేతలను ప్రధాని మోదీ పలకరించారు. ఈ సందర్భంగా పార్టీల నేతలందా గజమాలను ప్రధాని మెడలో వేశారు. అనంతరం భేటీ మొదలైంది.

న్యూఢిల్లీ: బెంగళూరులో ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టుకుని, ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుపై యుద్ధం ప్రకటించిన కొద్దిసేపటికే దేశ రాజధాని న్యూఢిల్లీలో బీజేసీ సారధ్యంలో 38 పార్టీలతో కూడిన ఎన్డీఏ మెగా భేటీ ఆరంభమైంది. భేటీ హాజరైన నేతలను ప్రధాని మోదీ పలకరించారు. ఈ సందర్భంగా పార్టీల నేతలందా గజమాలను ప్రధాని మెడలో వేశారు. అనంతరం భేటీ మొదలైంది.

ఈ సమావేశానికి హాజరైన 38 పార్టీలలో చాలా వరకు చిన్న మిత్రపక్షాలు ఉన్నాయి. కొన్ని పార్టీలకు ఒక్క ఎంపీ కూడా లేరు. అయితే ప్రధానమంత్రితో భేటీ ద్వారా వచ్చే ఎన్నికల్లో పోటీకి మార్గం సుగుమం అవుతుందని ఆయా పార్టీల నేతలు ఆశిస్తున్నారు. ఇక బీజేపీ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాది, పశ్చిమ, ఈశాన్య రాష్ట్రాలలోనూ సీట్లు పెంచుకునేందుకే ప్రణాళిక రచిస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి కీలకమైన రాష్ట్రాలలో కీలకమైన భాగస్వామ్యాల ద్వారా వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, తెగల ఓట్లను ప్రభావితం చేయాలి యోచిస్తోంది.

బీహార్‌లో నితీష్ కుమార్ అన్ని పార్టీలను మహాకూటమిలోకి చేర్చారు. లోక్ జనశక్తి పార్టీ మాత్రమే బీజేపీకి మిగిలింది. బీజేపీ ఇప్పుడు చిరాగ్ పాశ్వాన్, ఆయన అంకుల్‌ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా 6 శాతం పాశ్వాన్ ఓట్లు పొందొచ్చని భావిస్తోంది. బీహార్ నుంచి మరో మూడు పార్టీలు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి చెందిన ఉపేంద్ర సింగ్ కుష్వాహా, వికాశీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ముఖేష్ సహానీ, హిందుస్థానీ అవామ్ మోర్చాకు చెందిన జితిన్ రామ్ మాంఝీలు ఎన్‌డీఏలో చేరతారనే అంచనాలున్న విషయం తెలిసిందే. దక్షిణ రాష్ట్రాల విషయానికి వస్తే.. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, కేరళ కాంగ్రెస్ (థామస్) నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్ వర్గం ఈ భేటీలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.

Updated Date - 2023-07-18T19:39:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising