Bridge Collapse: గుజరాత్‌లో కుప్పకూలిన వంతెన..నదిలోకి జారిపడిన వాహనాలు
ABN, First Publish Date - 2023-09-24T20:36:49+05:30
గుజరాత్ లోని సురేంద్ర నగర్ జిల్లా వస్తాది గ్రామంలో ఒక పురాతన వంతెన ఆదివారంనాడు అకస్మాత్తుగా కుప్పకూలింది. ఒక డంపర్‌తో సహా రెండు బైక్‌లు వంతెన మీద వెళ్తుడంగా కుప్పకూలండతో దానిపై ఉన్న వాహనాలన్నీ నదిలో పడిపోయాయి. 10 మంది జలాల్లో చిక్కుకుపోగా, ఆరుగురిని సహాయక సిబ్బంది కాపాడారు.
గాంధీనగర్: గుజరాత్ (Gujarat)లోని సురేంద్ర నగర్ జిల్లా వస్తాది గ్రామంలో ఒక పురాతన వంతెన (Bridge) ఆదివారంనాడు అకస్మాత్తుగా కుప్పకూలింది. ఒక డంపర్‌తో సహా రెండు బైక్‌లు వంతెన మీద వెళ్తుడంగా కుప్పకూలండతో దానిపై ఉన్న వాహనాలన్నీ నదిలో పడిపోయాయి. 10 మంది జలాల్లో చిక్కుకుపోగా, ఆరుగురిని సహాయక సిబ్బంది కాపాడారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
కాగా, చురా నుంచి జాతీయ రహదారిని కలిపే ఈ వంతెన కుప్పకూలడంతో ఒక్కసారిగా హాహాకారాలు చెలరేగాయి. స్థానిక ప్రజలు, సర్పంచ్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. సమాచారం తెలియగానే పోలీసులు, స్థానిక యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టాయి. పాత వంతెన స్థానే కొత్త వంతెన కట్టాలని చాలాకాలంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Updated Date - 2023-09-24T20:41:38+05:30 IST