ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gujarat Dargah Row : దర్గా యాజమాన్యానికి నోటీసులు.. పోలీసులపై రాళ్ల దాడి, ఒకరి మృతి..

ABN, First Publish Date - 2023-06-17T13:06:20+05:30

గుజరాత్‌లోని జునాగఢ్, మాజేవాడి దర్వాజా ప్రాంతంలో శుక్రవారం రాత్రి అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ఈ ప్రాంతంలో నిర్మించిన దర్గా భూ యాజమాన్య హక్కు పత్రాలను సమర్పించాలని జునాగఢ్ నగర పాలక సంస్థ జూన్ 14న ఆదేశాలు జారీ చేయడంతో శుక్రవారం రాత్రి దాదాపు 600 మంది ఇక్కడికి చేరుకుని, రహదారులను దిగ్బంధనం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : గుజరాత్‌లోని జునాగఢ్, మాజేవాడి దర్వాజా ప్రాంతంలో శుక్రవారం రాత్రి అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ఈ ప్రాంతంలో నిర్మించిన దర్గా భూ యాజమాన్య హక్కు పత్రాలను సమర్పించాలని జునాగఢ్ నగర పాలక సంస్థ జూన్ 14న ఆదేశాలు జారీ చేయడంతో శుక్రవారం రాత్రి దాదాపు 600 మంది ఇక్కడికి చేరుకుని, రహదారులను దిగ్బంధనం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

పోలీసు సూపరింటెండెంట్ రవి తేజ వాసంశెట్టి తెలిపిన వివరాల ప్రకారం, మాజేవాడి దర్వాజా ప్రాంతంలో ఆక్రమించుకున్న భూమిలో దర్గాను నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో జునాగఢ్ నగర పాలక సంస్థ జూన్ 14న ఈ దర్గా యాజమాన్యానికి నోటీసు ఇచ్చింది. భూ యాజమాన్య హక్కు పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దాదాపు 600 మంది శుక్రవారం రాత్రి దర్గా వద్దకు చేరుకుని, పోలీసులపై రాళ్లదాడి చేశారు, రహదారులను దిగ్బంధనం చేశారు. ఫలితంగా వాహనదారులు నానా అవస్థలు పడ్డారు.

జునాగఢ్ డిప్యూటీ ఎస్‌పీ, ఇతర పోలీసు సిబ్బంది ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. దాదాపు గంటకుపైగా చర్చించిన తర్వాత రోడ్డుపైన పెట్టిన అడ్డంకులను తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దుండగులు శుక్రవారం రాత్రి 10.15 గంటల సమయంలో పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓ వాహనాన్ని తగులబెట్టారు. ఈ రాళ్లదాడిలో జునాగఢ్ డిప్యూటీ ఎస్పీ, ముగ్గురు సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. దీంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఆందోళనకారులపై లాఠీఛార్జి చేశారు.

రాళ్ల దాడిలో ఓ వ్యక్తి మరణించారని, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఈ మరణానికి కారణమేమిటో తెలుస్తుందని పోలీసులు తెలిపారు. 174 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు పోలీసులను మోహరించినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Nitish Kumar : మాంఝీపై నితీశ్ కుమార్ తీవ్ర ఆరోపణలు

Wrestlers : రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. బ్రిజ్ భూషణ్‌పై ఫొటోలు, వీడియోల సాక్ష్యాలు..

Updated Date - 2023-06-17T13:06:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising