ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చార్లెస్‌ యూనివర్సిటీలో దుండగుడి కాల్పులు

ABN, Publish Date - Dec 22 , 2023 | 03:20 AM

చెక్‌ రిపబ్లిక్‌లోని ప్రాగ్‌లో ఉన్న చార్లెస్‌ యూనివర్సిటీలో గురువారం కాల్పులు కలకలం రేపాయి. యూనివర్సిటీ బిల్డింగ్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 15 మంది దుర్మరణం చెందారు.

15 మంది దుర్మరణం.. పలువురికి గాయాలు

దుండగుడి మృతి.. చెక్‌ రాజధాని ప్రాగ్‌లో ఘటన

ప్రాగ్‌, డిసెంబరు 21: చెక్‌ రిపబ్లిక్‌లోని ప్రాగ్‌లో ఉన్న చార్లెస్‌ యూనివర్సిటీలో గురువారం కాల్పులు కలకలం రేపాయి. యూనివర్సిటీ బిల్డింగ్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 15 మంది దుర్మరణం చెందారు. కాల్పుల కారణంగా పలువురు గాయాలపాలైనట్టు చెక్‌ పోలీసులు తెలిపారు. చార్లెస్‌ యూనివర్సిటీ ఫిలాసఫీ డిపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌ వద్ద ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన దుండగుడిని అంతమొందించినట్టు చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తిని విద్యార్థిగా గుర్తించినట్టు ప్రాగ్‌ పోలీస్‌ చీఫ్‌ మార్టిన్‌ వోండ్రసెక్‌ తెలిపారు. అతను కాల్పులు జరపడానికి కారణాలు ఏమిటన్నది తెలియజేయలేదు. కాగా పేలుడు పదార్థాలు ఏమైనా ఉండవచ్చన్న అనుమానంతో బిల్డింగ్‌ బాల్కనీలు సహా ఆ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు జరుపుతున్నారు. బిల్డింగ్‌ను ఖాళీచేయించారు.

Updated Date - Dec 22 , 2023 | 03:20 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising