ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హెచ్‌-1బీ వీసా రెన్యువల్‌ అమెరికాలోనే..!

ABN, First Publish Date - 2023-11-30T03:28:56+05:30

అగ్రరాజ్యం అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్‌ నిపుణులకు జో బైడెన్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హెచ్‌-1బీ వీసాల రెన్యువల్‌ కోసం స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం ఇకపై ఉండదు.

డిసెంబరు నుంచి అమలు

పైలట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా తొలుత 20 వేల మందికి

భారతీయులకు భారీ లబ్ధి

ఫలించిన మోదీ ప్రయత్నం

వాషింగ్టన్‌, నవంబరు 29: అగ్రరాజ్యం అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్‌ నిపుణులకు జో బైడెన్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హెచ్‌-1బీ వీసాల రెన్యువల్‌ కోసం స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం ఇకపై ఉండదు. హెచ్‌-1బీ వీసాలను అమెరికాలోనే రెన్యువల్‌ చేయనున్నారు. ఈ విధానాన్ని డిసెంబరు నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఫలితంగా భారతీయులకు భారీ సంఖ్యలో లబ్ధి చేకూరనుందని వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ జూలీ స్టఫ్‌ వెల్లడించారు. పైలట్‌ ప్రోగ్రామ్‌లో ప్రస్తుతం 20 వేల మందికి మాత్రమే దీన్ని పరిమితం చేసినట్టు తెలిపారు. ‘‘భారత్‌లో అమెరికా వీసాలకు డిమాండ్‌ ఎక్కువ. ప్రస్తుతం ఆరు నుంచి 12 నెలల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. భారత్‌ విషయంలో ఇది సరికాదని భావిస్తున్నాం. భారత పౌరులకు త్వరితగతిన ఉద్యోగాలు లభించాలని మేం భావిస్తున్నాం. దీనిలో భాగంగా తాజా నిర్ణయం తీసుకున్నాం.’’ అని జూలీ స్టఫ్‌ తెలిపారు. రానున్న మూడు మాసాల్లో అమెరికాలో ఉంటున్న 20 వేల మంది విదేశీ పౌరులకు వీసా రెన్యువల్‌ చేయనున్నట్టు వివరించారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారని తెలిపారు. నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగుల్లో భారతీయుల సంఖ్యే ఎక్కువగా ఉందని, వీసా రెన్యువల్‌ కోసం భారత్‌కు తిరిగి వెళ్లడం లో వారి ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఈ విషయం చర్చకు వచ్చిందని, ఇప్పుడు కార్యరూపం దాలుస్తోందని తెలిపారు. అధికారిక ఉత్తర్వులను త్వరలోనే జారీ చేస్తామన్నారు. ఇదిలావుంటే గత ఏడాది భారత విద్యార్థులకు లక్షా 40 వేల వీసాలను మంజూరు చేసినట్టు అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. భారత విద్యార్థులకు లక్షా 40 వేల వీసాలను మంజూరు చేసినట్టు వివరించింది.

Updated Date - 2023-11-30T03:28:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising