ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hamas - Israel conflict: ‘జెరూసలేం పోస్ట్’ సంచలన రిపోర్ట్.. ఇజ్రాయిల్‌పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదుల జేబుల్లో..

ABN, First Publish Date - 2023-10-20T21:16:15+05:30

ఇజ్రాయిల్‌పై అక్టోబర్ 7న అనూహ్య రీతిలో భీకర దాడితో నరమేధం సృష్టించిన హమాస్ ఉగ్రవాదులు డ్రగ్స్ తీసుకొని ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు ‘ది జెరూసలేం పోస్ట్’ రిపోర్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆలోచనపై తీవ్ర ప్రభావం చూపించే ‘క్యాప్టగాన్’ అనే డ్రగ్ ప్రభావంతో ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్టు పేర్కొంది.

టెల్ అవీవ్: ఇజ్రాయిల్‌పై అక్టోబర్ 7న అనూహ్య రీతిలో భీకర దాడితో నరమేధం సృష్టించిన హమాస్ ఉగ్రవాదులు డ్రగ్స్ తీసుకొని ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు ‘ది జెరూసలేం పోస్ట్’ రిపోర్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆలోచనపై తీవ్ర ప్రభావం చూపించే ‘క్యాప్టగాన్’ అనే డ్రగ్ ప్రభావంతో ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్టు పేర్కొంది. ఈ డ్రగ్ సింథటిక్ అంఫెటమైన్ రకానికి చెందిన స్టిములెంట్ అని వివరించింది.

ఈ మేరకు ఇజ్రాయిల్‌ మట్టుబెట్టిన చాలామంది హమాస్ ఉగ్రవాదుల జేబుల్లో ‘క్యాప్టగాన్’ పిల్స్ లభించాయని ‘జెరూసలేం పోస్ట్’ రిపోర్ట్ పేర్కొంది. ఈ డ్రగ్‌ను పేదల కొకైన్ అని కూడా పిలుస్తారని పేర్కొంది. నేరాలకు పాల్పడేందుకు హమాస్ ఉగ్రవాదులు ఈ డ్రగ్‌ను వాడుతారని, ఎలాంటి నరమేధాన్నైనా సృష్టిస్తారని రిపోర్ట్ వివరించింది. ఈ డ్రగ్ ఉగ్రవాదులను ఎక్కువ సమయంపాటు యాక్టివ్‌గా ఉండేలా పనిచేస్తుందని, ఆకలి తెలియకుండా చేస్తుందని వివరించింది.


కాగా.. కాప్టగాన్ పేరు ఎక్కువగా 2015లో వినిపించింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు ఎలాంటి భయంబెరుకు లేకుండా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఈ డ్రగ్‌ను ఉపయోగిస్తున్నారని బయటపడడంతో ఈ డ్రగ్ గురించి అందరికీ తెలిసిందే. సుఖం భావనతోపాటు నిద్ర అవసరం తగ్గడం, ఆకలిని అణచివేయడం, ఎక్కువ సమయం ఎనర్జీ వంటి లక్షణాలు ఈ డ్రగ్ తీసుకున్నవారిలో కనిపిస్తాయి.

Updated Date - 2023-10-20T21:16:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising