ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nuh violence : హర్యానాలో మత ఘర్షణలు.. ఇద్దరు హోం గార్డులు సహా ముగ్గురి మృతి..

ABN, First Publish Date - 2023-08-01T09:45:25+05:30

హర్యానాలోని నుహ్‌లో మత ఘర్షణలు చెలరేగాయి. బ్రిజ్ మండల్ జలాభిషేక యాత్రలో పాల్గొన్నవారిపై ఓ మూక రాళ్లు విసరడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఈ ఘర్షణల్లో ఇద్దరు హోం గార్డులు సహా ముగ్గురు మరణించగా, 200 మందికిపైగా గాయపడ్డారు. దుండగులు కొన్ని కార్లను తగులబెట్టారు. దీంతో బుధవారం వరకు ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు.

న్యూఢిల్లీ : హర్యానాలోని నుహ్‌లో మత ఘర్షణలు చెలరేగాయి. బ్రిజ్ మండల్ జలాభిషేక యాత్రలో పాల్గొన్నవారిపై ఓ మూక రాళ్లు విసరడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఈ ఘర్షణల్లో ఇద్దరు హోం గార్డులు సహా ముగ్గురు మరణించగా, 200 మందికిపైగా గాయపడ్డారు. దుండగులు కొన్ని కార్లను తగులబెట్టారు. దీంతో బుధవారం వరకు ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హర్యానాలోని గురుగ్రామ్, సివిల్ లైన్స్ నుంచి సోమవారం బ్రిజ్ మండల్ జలాభిషేక యాత్ర ప్రారంభమైంది. బీజేపీ జిల్లా శాఖ అధ్యక్షుడు గార్గి కక్కర్, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రను నుహ్‌లోని ఖేద్లా మోడ్ వద్ద కొందరు దుండగులు అడ్డుకుని, రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో హోం గార్డులు నీరజ్, గురుసేవక్ ప్రాణాలు కోల్పోగా, దాదాపు 200 మందికిపైగా గాయపడ్డారు. డజన్ల కొద్దీ వాహనాలను తగులబెట్టారు.

నుహ్‌లో ఘర్షణలు జరిగినట్లు తెలుసుకున్న వెంటనే సోహ్నాలో రెండు మతాలవారు ఘర్షణలకు దిగారు. రోడ్లను కొన్ని గంటలపాటు దిగ్బంధనం చేశారు. కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. నుహ్‌లోని సైబర్ పోలీస్ స్టేషన్‌పై దుండగులు దాడి చేశారు. దుండగులు ఓ బస్సును లాక్కొని, పోలీస్ స్టేషన్ గోడను ఢీకొట్టి, గేటును పడగొట్టారు. మూడు పోలీసు వాహనాలను తగులబెట్టారు. ఇటీవల సైబర్ దొంగలపై పోలీసులు విరుచుకుపడినందుకు సైబర్ పోలీస్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని, ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని పోలీసులు చెప్పారు. దాదాపు 1,000 మంది దుండగులు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారని చెప్పారు.

ఈ ఘర్షణల నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్‌లలోని పాఠశాలలు, కళాశాలలను మంగళవారం మూసివేయాలని అధికారులు ఆదేశించారు. గురుగ్రామ్, నుహ్‌లలో సీఆర్‌పీసీ సెక్షన్ 144 నిబంధనలను అమలు చేస్తున్నారు. భివానీ పోలీసు సూపరింటెండెంట్ నరేంద్ర బిజర్నియాన్ మాట్లాడుతూ, పారామిలిటరీ దళాలను, హర్యానా ఎస్‌టీఎఫ్ బలగాలను మోహరించినట్లు తెలిపారు. పరిస్థితిని రాష్ట్ర డీజీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు.

హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరారు. ఘర్షణలు జరిగిన నుహ్ ప్రాంతానికి అదనపు బలగాలను పంపిస్తున్నట్లు తెలిపారు. హెలికాప్టర్లలో బలగాలను పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

ఘర్షణ ఎలా ప్రారంభమైంది?

విశ్వహిందూ పరిషత్ తదితర సంస్థల ఆధ్వర్యంలో జరిగిన యాత్రపై కొందరు దుండగులు రాళ్లు రువ్వడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. భివానీలో ఇద్దరి మరణాల కేసులో నిందితుడు మోను మానేసర్ సందర్శిస్తున్నట్లు వార్తలు రావడంతో ఈ ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

Minister: మంత్రి సంచలన వ్యాఖ్యలు.. విధులు విస్మరించి విమర్శించడమే ఆయన పని

Tomato: టమోటా @ 200

Updated Date - 2023-08-01T09:45:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising