ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan 3: సేఫ్‌గా ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ చందమామపై తీసిన ఫొటోలు వచ్చేశాయ్..!

ABN, First Publish Date - 2023-08-23T21:57:26+05:30

జాబిల్లిపై సురక్షితంగా ల్యాండ్ అయిన చంద్రయాన్-3కి సంబంధించి.. ఈ ఘనత సాధించిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కమ్మని కబురు దేశ ప్రజలకు అందించింది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌కు, బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంతో(MOX-ISTRAC) కమ్యూనికేషన్ లింక్ ఏర్పడినట్లు ట్విటర్ వేదికగా ఇస్రో వెల్లడించింది. అంతేకాదు.. ల్యాండర్ చంద్రుడిపై దిగాక తీసిన ఫొటోలను కూడా ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

జాబిల్లిపై సురక్షితంగా ల్యాండ్ అయిన చంద్రయాన్-3కి సంబంధించి.. ఈ ఘనత సాధించిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కమ్మని కబురు దేశ ప్రజలకు అందించింది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌కు, బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంతో(MOX-ISTRAC) కమ్యూనికేషన్ లింక్ ఏర్పడినట్లు ట్విటర్ వేదికగా ఇస్రో వెల్లడించింది. అంతేకాదు.. ల్యాండర్ చంద్రుడిపై దిగాక తీసిన ఫొటోలను కూడా ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలతో పాటు ల్యాండర్ విక్రమ్ జాబిల్లిపై దిగుతున్న సమయంలో తీసిన ఫొటోను కూడా ఇస్రో షేర్ చేసింది. ల్యాండర్ నీడ చంద్రుడి ఉపరితలంపై స్పష్టంగా కనిపించింది. రాళ్లు, గుంతలు లేని చదునైన ప్రదేశంలో చంద్రయాన్-3 ల్యాండ్ అయినట్లు ఆ ఫొటోను చూస్తే స్పష్టమైంది.


షార్‌ నుంచీ గత నెల 14వ తేదీన చంద్రయాన్‌-3 ద్వారా ప్రయోగించిన ప్రొపల్షన్‌ మాడ్యూల్‌, విక్రమ్‌ ల్యాండర్‌, రోవర్‌ 40 రోజుల్లో చంద్రుని చేరుకున్నాయి. భూమి నుంచీ చంద్రుడున్న 3,84,400 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 40 రోజుల్లో ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ అధిగమించింది. ఈనెల 5వ తేదీన చంద్రుని కక్ష్యను చేరుకున్న మాడ్యూల్‌ అక్కడ ఐదు రోజుల పాటు పరిభ్రమించింది. ఆపై క్రమంగా చంద్రునికి చేరువవుతూ వస్తోంది. తొలుత చంద్రుడి ఉపరితలానికి వంద కిలోమీటర్లు చేరువైన మాడ్యూల్‌ ఆపై 30 కిలోమీటర్ల సమీపానికి చేరుకుంది. అక్కడ మాడ్యూల్‌ నుంచీ విక్రమ్‌ ల్యాండర్‌, అందులోని రోవర్‌ విడిపోయాయి. షార్‌ నుంచీ కేవలం చంద్రయాన్‌-3 రాకెట్‌ను ప్రయోగించారు తప్పితే ఇతర సాంకేతిక ప్రక్రియ యావత్తూ బెంగళూరులో ఇస్రోకు చెందిన ఇండియన్‌ డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచీ శాస్త్రవేత్తలు మాడ్యూల్‌ను, తర్వాత విక్రమ్‌ ల్యాండర్‌ను, ఆపై చివరగా రోవర్‌ను ట్రాక్‌ చేయడంతో పాటు నియంత్రించనున్నారు.

చందమామ రహస్యాలు తెలుసుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. 2008 అక్టోబరు 22న పీఎస్‌ఎల్వీ-సీ 11 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌-1ని ఇస్రో ప్రయోగించింది. 2008 నవంబరు 8న అది చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించి పరిశోధనలు సాగించింది. దీనిలో భాగంగా ప్రయోగించిన 35 కిలోల మూన్‌ ఇంపాక్ట్‌ చందమామ ఉపరితలంపై నీటి జాడను తొలిసారిగా గుర్తించింది. ఇది భూకక్ష్యలోకి విజయవంతంగా దూసుకెళ్లి ఇస్రోకు చంద్ర మండలంలో ఉన్న ఖనిజాలు, నీటి జాడలు, మట్టి గుర్తించింది.

Updated Date - 2023-08-23T21:58:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising