Telangana Elections: ఓటరు జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలి? పోలింగ్ బూత్‌కి తీసుకెళ్లాల్సిన పత్రాలేంటి?
ABN, First Publish Date - 2023-11-27T21:50:48+05:30
తెలంగాణలో నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. తాము ఓటు వేయడానికి అర్హులమా? కాదా? ఓటరు జాబితాలో తమ పేరు ఉందా?
Telangana Elections: తెలంగాణలో నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. తాము ఓటు వేయడానికి అర్హులమా? కాదా? ఓటరు జాబితాలో తమ పేరు ఉందా? లేదా? అనేది నిర్ధారించుకోవడం ఎంతో ముఖ్యం. అఫ్‌కోర్స్.. ఇప్పటికే ఈ విషయాన్ని దాదాపు ప్రతిఒక్కరూ నిర్ధారించుకొని ఉంటారు. కానీ.. కొందరు ఇంకా చెక్ చేసుకోకపోవచ్చు. అసలే ఇది దొంగ ఓట్లు నడుస్తున్న జమానా కాబట్టి.. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం ఎంతో మంచిది. అలాగే.. ఓటింగ్ కేంద్రాన్ని కూడా తనిఖీ చేసుకోవాలి. తమ వ్యక్తిగత EPIC నంబర్ ద్వారా ఓటర్లు దీనిని చెక్ చేసుకోవచ్చు. ఓటర్లందరికీ భారత ఎన్నికల సంఘం ఎలక్టర్స్ ఫోటో గుర్తింపు కార్డు లేదా EPIC నంబర్‌ను జారీ చేస్తుంది. ఈ EPIC నంబర్ అనేది ఓటర్ ఐడీ కార్డ్‌లోనే ఉంటుంది.
ఓటరు జాబితాలో పేరును ఎలా తనిఖీ చేయాలి?
* ముందుగా ఈసీఐ వెబ్‌సైట్ https://electoralsearch.eci.gov.in ని విజిట్ చేయాలి.
* వెబ్‌సైట్‌కి వెళ్లగానే మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. 1. సెర్చ్ బై డీటెయిల్స్, 2. సెర్చ్ బై ఎపిక్, 3. సెర్చ్ బై మొబైల్
* ఎపిక్ ఆప్షన్‌ని ఎంపిక చేసుకొని.. మీ ఎపిక్ నంబర్ ఎంటర్ చేసి, రాష్ట్రం విభాగంలో తెలంగాణని ఎంపిక చేయాలి.
* ఆ తర్వాత కింద పేర్కొన్న Captcha Code ని ఎంటర్ చేసి, సెర్చ్ ఆప్షన్ మీద నొక్కాలి.
* అప్పుడు తెలంగాణలోని ఓటరు జాబితాలో మీ పేరు, వివరాలు తెరపై కనిపిస్తాయి.
* ఒకవేళ ఎపిక్ నంబర్ గురించి తెలియకపోతే.. మీ పేరు, పుట్టిన తేదీ, అసెంబ్లీ నియోజకవర్గం వంటి వ్యక్తిగత వివరాల ద్వారా ఓటరు జాబితాలో మీ పేరుని శోధించవచ్చు.
ఇక ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వెళ్లేటప్పుడు.. తప్పనిసరిగా రెండు పత్రాలను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అవి.. 1. ఆధార్ కార్డు, 2. ఓటర్ ఐడీ కార్డ్. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే.. పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదైనా ఇతర ఫోటో IDని తీసుకువెళ్లాలి.
Updated Date - 2023-11-27T21:50:49+05:30 IST