ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Umang App: ఉమాంగ్ యాప్‌ ద్వారా ఇంట్లో కూర్చొని PF విత్‌‌డ్రా చేసుకోండి. ఎలాగంటే..

ABN, First Publish Date - 2023-04-24T17:45:00+05:30

మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరం అయితే, కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన అవసరం లేదు. ఉమాంగ్ యాప్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉద్యోగులు తమ జీతంలో కొంత భాగాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) రూపంలో పొదుపు చేస్తారు. PF ఖాతాదారులు EPFOలో డిపాజిట్ చేసిన మొత్తంలో తమ పదవీ విరమణ తర్వాత 100శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే అంతకంటే ముందే డబ్బు కోసం అత్యవసర ఎదురైన పరిస్థితుల్లో కూడా భవిష్య నిధి ఖాతా నుంచి కొంత డబ్బును విత్‌డ్రా తీసుకోవచ్చు. మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరం అయితే, కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన అవసరం లేదు. ఉమాంగ్ యాప్ (UMANG App) ద్వారా PF ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.

ఉమాంగ్ యాప్ ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు ఈ విధంగా చేయండి.

  • ఉమంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, మీ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి నమోదు చేసుకోండి.

  • యాప్‌లో అందుబాటులో ఉన్న చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. వాటినుంచి EPFO సెలెక్ట్ చేసుకోండి

  • Raise Claim Option ఆప్షన్‌ను ఎంచుకొని మీ UAN నంబర్‌ను ఎంటర్ చేయండి.

  • EPFOలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి.

  • మీ PF ఖాతా నుంచి With Drawl ఆప్షన్ ఎంచుకుని, ఫారంను నింపండి.

  • ఫారంను Submit చేసిన తర్వాత విత్‌‌డ్రా అభ్యర్థన కోసం Reference Numberను పొందండి.

  • ఇచ్చిన Reference Numberను ఉపయోగించి Withdrawal Requestను ట్రాక్ చేయండి.

  • 3-5 రోజులలోపు మీ ఖాతాకు EPFO డబ్బును బదిలీ చేస్తుంది.

Updated Date - 2023-04-24T18:01:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising