కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఛత్తీస్‌గఢ్‌లో ఐఏఎస్‌ అధికారిణి రాణు సాహు అరెస్టు

ABN, First Publish Date - 2023-07-23T01:14:29+05:30

ఛత్తీ స్‌గఢ్‌లో బొగ్గు లెవీ స్కాంతో సంబంధం ఉందన్న ఆరోపణలపై మనీ లాండరింగ్‌ కేసును ఎదుర్కొంటున్న మహిళా ఐఏఎస్‌ అధికారి రాణు సాహును ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకుల హోదాలో ఉన్న రాణు సాహును శనివారం కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం

ఛత్తీస్‌గఢ్‌లో ఐఏఎస్‌ అధికారిణి రాణు సాహు అరెస్టు

రాయ్‌పూర్‌, జూలై 22: ఛత్తీ స్‌గఢ్‌లో బొగ్గు లెవీ స్కాంతో సంబంధం ఉందన్న ఆరోపణలపై మనీ లాండరింగ్‌ కేసును ఎదుర్కొంటున్న మహిళా ఐఏఎస్‌ అధికారి రాణు సాహును ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకుల హోదాలో ఉన్న రాణు సాహును శనివారం కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం ఆమెను మూడు రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. రాణు సాహు గతంలో.. రాష్ట్రంలో కోల్‌బెల్ట్‌ ప్రాంతమైన కోర్బా, రాయ్‌గఢ్‌ జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో చోటుచేసుకున్న బొగ్గు లెవీ స్కాంలో ఆమె పాత్రధారి అయ్యారన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈడీ అధికారులు శుక్రవారం రాణు సాహు నివాసంలో రూ.5.52 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2023-07-23T01:14:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising