Dr. Srinivasa Reddy: ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డికి ప్రతిష్ఠాత్మక ఐఎన్‌ఎస్‌ఏ ఫెలోషిప్
ABN, First Publish Date - 2023-09-15T04:22:37+05:30
హైదరాబాద్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనివాస రెడ్డికి ప్రతిష్ఠాత్మక ఇండియన్ నేషనల్ సైన్సెస్ అకాడమీ (ఐఎన్‌ఎస్‌ఏ) ఫెలోషిప్ దక్కింది.
హైదరాబాద్, సెప్టెంబరు 14: హైదరాబాద్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనివాస రెడ్డికి ప్రతిష్ఠాత్మక ఇండియన్ నేషనల్ సైన్సెస్ అకాడమీ (ఐఎన్‌ఎస్‌ఏ) ఫెలోషిప్ దక్కింది. పలు ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు ఉపయోగపడే ఔషధాల తయారీకి.. మాలిక్యూల్స్‌ను కనుగొనడంలో కీలక పాత్ర పోషించినందుకు ఆయనకు 2023 సంవత్సరానికి ఈ అవార్డు లభించింది. నల్లగొండలో జన్మించి హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేసిన శ్రీనివాసరెడ్డి.. సస్యసంరక్షణ రసాయనాలు, దోమల నివారణ ఔషధాల తయారీలోకూడా ప్రధాన పాత్ర పో షించారు. గతంలో ప్రతిష్ఠాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్, జేసీ బోస్ నేషనల్ అవార్డులనూ ఆయన అందుకున్నారు. శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఐఐసీటీతో పాటు లఖ్‌నవూ సీడీఐఆర్, జమ్మూ ఐఐఐఎమ్ సారధిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Updated Date - 2023-09-15T04:22:37+05:30 IST