IIT Madras: మరో విద్యార్థి ఆత్మహత్య, ఏడాదిలో ఇది నాలుగవది..
ABN, First Publish Date - 2023-04-21T18:31:10+05:30
చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూ ట్ ఆప్ టెక్నాలజీ హాస్టల్ రూమ్‌లో ఉంటున్న ఒక విద్యార్థి..
చెన్నై: చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూ ట్ ఆప్ టెక్నాలజీ (IIT) హాస్టల్ రూమ్‌లో ఉంటున్న ఒక విద్యార్థి శుక్రవారంనాడు తన గదిలో మరణించాడు. ఇది ఆత్మహత్య కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు మహారాష్ట్రకు చెందిన విద్యార్థి అని, కెమికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. కేసు విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. విచారణ అనంతరం ఇది ఆత్మహత్యేనని పోలీసులు నిర్ధారిస్తే, ఐఐటీ-మద్రాసులో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏడాదిలో ఇది నాలుగవది అవుతుంది.
దీనికి ముందు, గత మార్చిలో 32 ఏళ్ల పీహెచ్‌డీ విద్యార్థి తన గదిలో ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. అతనిని పశ్చిమబెంగాల్ వాసిగా పోలీసులు గుర్తించారు. మార్చిలోనే ఇదే క్యాంపస్‌కు చెందిన మూడో సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడిగా గుర్తించారు. గత ఫిబ్రవరిలో కూడా ఐఐటీ-మద్రాసులో ఆత్మహత్య ఘటన చోటుచేసుకుంది. అతనిని మహారాష్ట్రకు చెందిన రీసెర్చ్ స్కాలర్‌గా పోలీసులు గుర్తించారు.
Updated Date - 2023-04-21T18:31:10+05:30 IST