ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Coal mine Collapses: అక్రమ బొగ్గు గని కుప్పకూలి ముగ్గురి దుర్మరణం

ABN, First Publish Date - 2023-06-09T18:26:50+05:30

జార్ఖాండ్‌లోని ధన్‌బాద్‌లో అక్రమ బొగ్గు గని కుప్పకూలి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. బీసీసీఎల్ ఓపెన్ మైన్‌లోని కొంతభాగం శుక్రవారం ఉదయం కుప్పకూలినట్టు ధన్‌బాద్ ఎస్ఎస్‌పీ సంజీవ్ కుమార్ తెలిపారు. మృతుల సంఖ్యను నిర్ధారించాల్సి ఉందన్నారు.

ధన్‌బాద్: జార్ఖాండ్‌లోని ధన్‌బాద్‌లో అక్రమ బొగ్గు గని (Coal mine) కుప్పకూలి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. బీసీసీఎల్ (Bharat Coking Coal Limted) ఓపెన్ మైన్‌లోని కొంతభాగం శుక్రవారం ఉదయం కుప్పకూలినట్టు ధన్‌బాద్ ఎస్ఎస్‌పీ సంజీవ్ కుమార్ తెలిపారు. మృతుల సంఖ్యను నిర్ధారించాల్సి ఉందని, బీసీసీఎల్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కాగా, ఈ బొగ్గు గని భోవ్రా ఏరియా కిందకు వస్తుందని, అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తోందని జోరాపోఖర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ బినోద్ ఒరయాన్ తెలిపారు. ఘటనపై దర్యప్తు జరుపుతున్నామని, మృతుల సంఖ్యను నిర్ధారించాల్సి ఉందని చెప్పారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-06-09T18:55:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising