ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో విజయం దిశగా బీజేపీ.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-12-03T11:48:11+05:30

ప్రధాని మోదీ సంక్షేమ పథకాల కారణంగా కౌంటింగ్‌లో బీజేపీ అనుకూల ఫలితాలు చూస్తున్నామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు.

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌‌లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అనుకూల కౌంటింగ్ సరళికి ప్రధాని మోదీ సంక్షేమ పథకాలే కారణమని స్పష్టం చేశారు.

‘‘మోదీ గారు రాష్ట్ర ప్రజల మనసుల్లో ఉన్నారు. రాష్ట్రం మోదీ మనసులో ఉంది. రాష్ట్రంలో ప్రధాని అనేక ర్యాలీలు నిర్వహించి ప్రజల హృదయాల్ని తాకారు. ప్రస్తుతం మనం చూస్తున్న కౌంటింగ్ సరళి దాని ఫలితమే. రాష్ట్రం, కేంద్రంలోని ఒకే పార్టీతో డంబుల్ ఇంజిన్ ప్రభుత్వం..చక్కగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు హృదయాల్ని స్పృశించాయి. యావత్ రాష్ట్రం ఒక కుటుంబంగా మారింది. బీజేపీకి విజయం తథ్యమని నేను గతంలోనే చెప్పాను. ప్రజల ప్రేమాభిమానాల కారణంగా బీజేపీ అధ్భుత విజయం సాధించబోతోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ సీట్లు ఉండగా బీజేపీ ఏకంగా 157 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 69 స్థానాల్లో ఆధిపత్యం కొనసాగిస్తోంది.

Updated Date - 2023-12-03T11:53:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising