ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సైనిక పరికరాల సంయుక్త ఉత్పత్తికి భారత్‌, ఫ్రాన్స్‌ అంగీకారం

ABN, First Publish Date - 2023-07-19T02:42:46+05:30

దీర్ఘకాల భాగస్వామ్యంలో భాగంగా భారత్‌, ఫ్రాన్స్‌ కలిసి కొత్త తరం సైనిక పరికరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మానుయేల్‌ లెనైన్‌ మంగళవారం

న్యూఢిల్లీ, జూలై 18: దీర్ఘకాల భాగస్వామ్యంలో భాగంగా భారత్‌, ఫ్రాన్స్‌ కలిసి కొత్త తరం సైనిక పరికరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మానుయేల్‌ లెనైన్‌ మంగళవారం తెలిపారు. ప్రధాని మోదీ తాజా ఫ్రాన్స్‌ పర్యటనలో ఈమేరకు ఇరుదేశాలూ అంగీకరించాయని ఆయన పేర్కొన్నారు. ‘‘భారత్‌తో బంధం బలోపేతంపై ఫ్రాన్స్‌లో రాజకీయంగా ఏకాభిప్రాయం నెలకొంది. అందరూ భారత్‌తో సత్సంబంధాలనే కోరుకుంటున్నారు. భారత్‌కు స్వాతంత్య్రం లభించి, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం ప్రారంభమై 2047కు వందేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన సందర్భంగా ఈ పాతికేళ్లకు రోడ్‌ మ్యాప్‌ను రూపొందించడంపై భారత్‌, ఫ్రాన్స్‌లు అంగీకరించాయి. మహారాష్ట్రలోని జైతాపూర్‌లో 1650 మెగావాట్ల అణువిద్యుత్‌ ప్రాజెక్టు విషయంలోనూ ఇప్పటికే కొంతమేర పురోగతి కనిపిస్తోంది’’ అని ఆయన వివరించారు.

Updated Date - 2023-07-19T02:42:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising