ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gurpatwant Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ హత్యకు కుట్ర.. భగ్నమైందంటూ భారత్‌కి అమెరికా సమాచారం

ABN, First Publish Date - 2023-11-23T13:03:07+05:30

ఈమధ్య కాలంలో భారత ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించిన వ్యక్తులు విదేశాల్లో ఒక్కొక్కరుగా హత్యకు గురవుతున్నారు. ఎవరు చంపుతున్నారో తెలీదు కానీ.. ఆ ఉగ్రవాదులు ఒంటరిగా దొరికినప్పుడు, అవకాశం చూసుకొని దాడులకు పాల్పడుతున్నారు.

Arindam Bagchi: ఈమధ్య కాలంలో భారత ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించిన వ్యక్తులు విదేశాల్లో ఒక్కొక్కరుగా హత్యకు గురవుతున్నారు. ఎవరు చంపుతున్నారో తెలీదు కానీ.. ఆ ఉగ్రవాదులు ఒంటరిగా దొరికినప్పుడు, అవకాశం చూసుకొని దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్‌లో పలువురు ఉగ్రవాదులు హత్యకావింపబడగా.. కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఏకంగా భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన వివాదాలకు దారితీసింది. ఇలాంటి తరుణంలో.. మరో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ హత్యకు కూడా అమెరికా గడ్డపై కుట్ర జరిగిందంటూ ఆ అగ్రరాజ్యం భారత్‌కు సమాచారం అందించింది. అయితే.. ఈ కుట్రని తాము భగ్నం చేశామని అమెరికా వెల్లడించినట్టు పశ్చిమ దేశాల పత్రికల కథనాలు వెలువరించాయి. దీంతో.. ఈ వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.


ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం.. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూని తమ గడ్డపై చంపేందుకు ప్రయత్నాలు జరిగాయని, అయితే తాము ఆ కుట్రను భగ్నం చేశామని అమెరికా వెల్లడించింది. ఈ అంశాన్ని తాము తీవ్రంగా పరిగణించామని, భారత ప్రభుత్వానికి చెందిన ఉన్నతస్థాయి అధికారులకు ఈ సమాచారం గురించి తెలియజేశామని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి ఆండ్రీన్‌ వాట్సన్‌ చెప్పినట్లు సదరు కథనం పేర్కొంది. ఈ విషయం వినగానే భారత అధికారులు ఆందోళన వ్యక్తం చేశారని, దీనిపై భారత్ తదుపరి దర్యాప్తు చేస్తుందని తమకు అర్థమైందని, ఈ కుట్రకు బాధ్యులైన వారిని శిక్షించాలని తాము భావిస్తున్నామని ఆండ్రీన్ పేర్కొన్నట్లు ఆ కథనం తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటనపై అమెరికా ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే.. అమెరికా ఇచ్చిన సమాచారాన్ని తాము పరిశీలిస్తున్నట్లు భారత విదేశాంగశాఖ పరోక్షంగా తెలిపింది.

భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చి మాట్లాడుతూ.. ఇటీవల భారత్‌-అమెరికా భద్రతా సహకారంపై ఇరు దేశాల మధ్య కొన్ని చర్చలు జరిగాయన్నారు. ఈ చర్చల్లో భాగంగానే.. వ్యవస్థీకృత నేరగాళ్లు, ఉగ్రవాదులు, వారి మధ్య బంధాలు, తదితర అంశాల గురించి అమెరికా అధికారులు కొంత సమాచారం ఇచ్చారన్నారు. ఆ సమాచార తీవ్రతను భారత్‌ గుర్తించిందన్న ఆయన.. అది రెండు దేశాల భద్రతా ప్రయోజనాలకు ఆందోళనకరమని అన్నారు. అమెరికా పంచుకున్న ఆ సమాచారాన్ని సంబంధిత శాఖలు ఇప్పటికే పరిశీలిస్తున్నాయని వివరించారు. మరోవైపు.. నవంబర్ 19వ తేదీన ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని పేల్చేస్తామని బెదిరింపులకు పాల్పడినందుకు పన్నున్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం కేసు నమోదు చేసింది. ప్రస్తుతం పన్నున్ అమెరికాలో తలదాచుకున్నాడు.

Updated Date - 2023-11-23T13:03:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising