cheetahs: దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు మరో 120 చీతాస్
ABN, First Publish Date - 2023-01-27T11:32:10+05:30
వచ్చే దశాబ్ద కాలంలో దక్షిణాఫ్రికా దేశం నుంచి 120 చీతాలు భారతదేశానికి రానున్నాయి...
రెండు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద కాలంలో దక్షిణాఫ్రికా దేశం నుంచి 120 చీతాలు భారతదేశానికి రానున్నాయి.(cheetahs) ఈ మేర భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది వచ్చే నెలలో 12 చీతాలతో(South Africa) కూడిన తొలి బ్యాచ్ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి (India)పంపించనున్నట్లు దక్షిణాఫ్రికా పర్యావరణ విభాగం వెల్లడించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కులో(Kuno National Park) ఇప్పటికే నమీబియా దేశం నుంచి వచ్చిన చీతాలతో సందడిగా మారింది.ప్రతి ఏటా 12 చీతాలు చొప్పున పదేళ్ల పాటు 120 చీతాలను భారతదేశానికి రప్పిస్తామని భారత అటవీశాఖ అధికారులు చెప్పారు.
చిరుతలను భారతదేశానికి పంపించాలన్న ప్రతిపాదనను దక్షిణాఫ్రికా పర్యావరణ, అటవీ,మత్స్య శాఖ మంత్రి బార్బరా క్రీసీ ఆమోదించారు. ఫిబ్రవరి నెలలో మరో 12 చీతాలు వస్తే భారతదేశంలో వీటి సంఖ్య 20కి చేరుకోనుంది.గత ఏడాది సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్‌లో ఎనిమిది చీతాలను ప్రవేశపెట్టారు.
Updated Date - 2023-01-27T11:32:13+05:30 IST