ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India 5th Super Power: ప్రపంచంలో భారత్ 5వ సూపర్ పవర్.. చైనా కంటే ముందుంది

ABN, First Publish Date - 2023-09-10T23:18:05+05:30

జీ20 శిఖరాగ్ర సమావేశాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భారతదేశంపై ఆఫ్రికన్ యూనియన్ చైర్‌పర్సన్, యూనియన్ ఆఫ్ కొమెరోస్ ప్రెసిడెంట్ అజలీ అసోమాని ప్రశంసల వర్షం..

జీ20 శిఖరాగ్ర సమావేశాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భారతదేశంపై ఆఫ్రికన్ యూనియన్ చైర్‌పర్సన్, యూనియన్ ఆఫ్ కొమెరోస్ ప్రెసిడెంట్ అజలీ అసోమాని ప్రశంసల వర్షం కురిపించారు. నివాసం పరంగా భారత్ ఐదో సూపర్ పవర్‌గా ఎదిగిందని, ఇప్పుడు చైనా కంటే ముందుందని కొనియాడారు. అంతేకాదు.. ఆఫ్రికాలో భారత్‌కు అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ‘‘ప్రపంచంలో భారతదేశం ఇప్పుడు ఐదో సూపర్ పవర్ కాబట్టి.. ఆఫ్రికాలో భారత్‌కు అవకాశాలున్నాయి. అంతరిక్షంలో (చంద్రయాన్-3 విజయాన్ని ఉద్దేశించి) విజయం సాధించిన భారత్ ఎంతో శక్తివంతమైనది కాబట్టి, భారత్‌తో సమన్వయం చేసుకోవాలని అనుకుంటున్నాం. నివాసం పరంగా భారత్ ఓ సూపర్ పవర్. ఇప్పుడు చైనా కంటే ముందుంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు.


ఇదే సమయంలో తమ ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం లభించడంపై అజలీ అసోమాని స్పందించారు. ఆఫ్రికన్ యూనియన్‌ను అధికారికంగా G20 కుటుంబంలోకి చేర్చుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తనను కౌగిలించుకున్న క్షణాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ.. ఇది తనకు ఉద్వేగభరితమైనదని అన్నారు. నిజానికి.. ఆఫ్రికన్ యూనియన్‌కు శాశత్వ సభ్యత్వంపై ఓ నిర్ణయానికి రావడం ముందు చర్చలు జరుగుతాయని తాను భావించానన్నారు. ఈ అంశంపై చర్చించిన తర్వాత ఓ నిర్ణయానికి వస్తారేమోనని తాను అనుకున్నానన్నారు. కానీ.. ఈ సమావేశం ప్రారంభంలోనే G20 కుటుంబంలో తమను సభ్యులుగా ప్రకటించారని, అప్పుడు తాను భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. ఇది తన జీవితంలోనే ఒక గొప్ప అనుభవమని ఆయన చెప్పుకొచ్చారు.

కాగా.. శనివారం జీ20 సమావేశాలు ప్రారంభ సమయంలో ఆఫ్రియన్ యూనియన్‌కు ప్రాతినిధ్యం వహించిన అసోమానిని జీ20 నాయకుల టేబుల్‌లో శాశ్వత సభ్యునిగా కూర్చోవాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. అప్పుడు అసోమాని మాట్లాడుతూ.. జీ20 కుటుంబంలో తమను చేర్చుకున్నందుకు జీ20 సభ్య దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ ఆదివారం అసోమానితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. G20 కుటుంబంలో ఆఫ్రికన్ యూనియన్‌ చేరినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2023-09-10T23:18:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising