ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Water Scarcity: 2050 నాటికి భారతదేశంలో తీవ్ర నీటి కొరత...యూఎన్ సంచలన నివేదిక

ABN, First Publish Date - 2023-03-23T13:15:45+05:30

మంచినీటి కొరతపై ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక విడుదల చేసింది...

Water Scarcity
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : మంచినీటి కొరతపై ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక విడుదల చేసింది.(Water Scarcity)2050 నాటికి భారతదేశం నీటి కొరతతో తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని(India Likely To Be Severely Affected) ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.(UN Report)నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రపంచ పట్టణ జనాభా 2016వ సంవత్సరంలో 933 మిలియన్ల నుంచి 2050 నాటికి 2.4 బిలియన్లకు పెరుగుతుందని అంచనా.యూఎన్ 2023 వాటర్ కాన్ఫరెన్స్‌కు ముందు మంగళవారం విడుదల చేసిన యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వాటర్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2023 లో నీటి కొరత విషయం వెల్లడైంది.

ఇది కూడా చదవండి : Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ షాక్... సూరత్ కోర్టు సంచలన తీర్పు

ఆసియా ఖండంలో 80 శాతం మంది ప్రజలు నీటి ఒత్తిడి సమస్య ఎదుర్కొంటున్నారని యూఎన్ తన నివేదికలో పేర్కొంది. ప్రపంచంలో నీటి సంక్షోభాన్ని నిరోధించడానికి బలమైన అంతర్జాతీయ యంత్రాంగాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ల మందికి సురక్షితమైన తాగునీరు లేదని, 3.6 బిలియన్ల మందికి సురక్షితమైన పారిశుధ్యం అందుబాటులో లేదని నివేదిక తెలిపింది.

ఇది కూడా చదవండి : Amritpal Singh: కేంద్ర భద్రతా బలగాల హై అలర్ట్

‘‘మానవాళికి జీవనాధారం నీరు అని, ప్రజల మనుగడకు ఇది చాలా ముఖ్యమైంది’’అని గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ స్వచ్ఛమైన నీరు అందించాలనేది ముఖ్యమైన అడుగు అని గుటెర్రెస్ చెప్పారు.

Updated Date - 2023-03-23T13:15:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising