ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

COVID-19 omicron variant: కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి.. 22 యాక్టివ్ కేసులు

ABN, Publish Date - Dec 22 , 2023 | 08:29 PM

కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ జేఎన్.1 (JN.1) వ్యాప్తిపై ఇండియాలో డిసెంబర్ 21వ తేదీ వరకూ 22 కేసులు నమోదయ్యాయి. అధికార వర్గాల సమాచారం ప్రకారం, కోవిడ్-19 క్లస్టరింగ్ సమాచారం ఇంతవరకూ లేదు. అన్ని కేసుల్లోనూ కోవిడ్ వేరియంట్ స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి.

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ జేఎన్.1 (JN.1) వ్యాప్తిపై ఇండియాలో డిసెంబర్ 21వ తేదీ వరకూ 22 కేసులు నమోదయ్యాయి. అధికార వర్గాల సమాచారం ప్రకారం, కోవిడ్-19 క్లస్టరింగ్ సమాచారం ఇంతవరకూ లేదు. అన్ని కేసుల్లోనూ కోవిడ్ వేరియంట్ స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి.


కరోనా కేసుల అప్‌డేట్..

దేశంలో మొత్తం నమోదైన కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 2,997గా ఉంది. డిసెంబర్ 22వ తేదీ నాటికి 640 కొత్త ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదు కావడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669 నుంచి 2,997కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్-19 కేసులు 4.50 కోట్లు. కేరళలో మరో మరణం చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య 5,33,328కి చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,70,887. జాతీయ రికవరీ రేటు 98.81గా ఉంది. ఫెటాలిటీ (మృతులు) రేటు 1.19 శాతంగా ఉందని, ఇంతవరకూ దేశంలో 220.67 కోట్ల కోవిడ్ డోస్‌లు ఇచ్చామని మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ చెబుతోంది.


కొత్త వేరియంట్‌పై డాక్టర్ సౌమ్య స్వామినాథన్

కాగా, కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మాజీ చీప్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. అయితే, ప్రజలు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఐసీఎంఆర్ మాజీ డీజీగా కూడా ఉన్న ఆమె సూచించారు. జేఎన్.1 వేరియంట్ చాలా తీవ్రమైనదని కాదనీ, నుమోనియా పెంచుతుందని కానీ మరిన్ని మరణాలు పెరగవచ్చని కానీ తమ వద్ద ఎలాంటి డాటా ఏదీ లేదని చెప్పారు. ఒమిక్రాన్ గురించి తెలిసిందేనని, జేఎన్.1 కూడా అదే కుటుంబానికి చెందినదని, అందువల్ల పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చని చెప్పారు. అయితే ఒకటి రెండు మ్యుటేషన్లు వెలుగుచూడవచ్చన్నారు. డబ్ల్యూహెచ్ఓ కూడా దీనిపై ఒక కన్నువేసి ఉంచిదని, ఇది ఇంట్రస్టింగ్ వేరియంటే కానీ ఆందోళన కలిగించే వేరియంట్ కాదని ఆమె చెప్పారు. తీవ్ర లక్షణాలు, సుదీర్ఘమైన జ్వరం, శ్వాస పరమైన ఇబ్బందులు కనిపిస్తే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Updated Date - Dec 22 , 2023 | 08:29 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising