Nepal: అన్నపూర్ణ పర్వతం నుంచి భారతీయ పర్వతారోహకుడి అదృశ్యం
ABN, First Publish Date - 2023-04-18T11:34:56+05:30
నేపాల్ దేశంలో పర్వతారోహణకు వెళ్లిన భారతీయ పర్వతారోహకుడు అనురాగ్ మాలు అనే యువకుడు అదృశ్యం అయ్యారు...
నేపాల్ దేశంలో పర్వతారోహణకు వెళ్లిన భారతీయ పర్వతారోహకుడు అనురాగ్ మాలు అనే యువకుడు అదృశ్యం అయ్యారు
ఖాట్మండు(నేపాల్): నేపాల్ దేశంలో పర్వతారోహణకు వెళ్లిన భారతీయ పర్వతారోహకుడు అనురాగ్ మాలు అనే యువకుడు అదృశ్యం అయ్యారు.(Indian climber)రాజస్థాన్ రాష్ట్రంలోని కిషన్‌గఢ్‌కు చెందిన అనురాగ్ మాలు అనే యువకుడు అన్నపూర్ణ పర్వతం 3(Mt Annapurna) క్యాంప్ నుంచి కిందకు దిగుతుండగా అదృశ్యమయ్యాడు.నేపాల్‌లోని(Nepal) అన్నపూర్ణ పర్వతం నుంచి అనురాగ్ దిగుతూ సోమవారం అదృశ్యమయ్యారని యాత్ర నిర్వాహక అధికారి తెలిపారు.సోమవారం ఉదయం నుంచి అనురాగ్ అదృశ్యమయ్యాడని ట్రెక్కింగ్ యాత్రను నిర్వహించిన సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ చైర్మన్ మింగ్మా షెర్పా చెప్పారు.
ఇది కూడా చదవండి : Karnataka Assembly polls: టికెట్ రాలేదని రోదించిన బీజేపీ ఎమ్మెల్యే
ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ గురించి అవగాహన కల్పించడానికి 8,000 మీటర్ల పైన ఉన్న మొత్తం 14 శిఖరాల్లో, ఏడు శిఖరాలను అధిరోహించే లక్ష్యంతో అనురాగ్ ఉన్నారు.అనురాగ్ అదృశ్యమైన కొద్దిసేపటికే తాము అతని కోసం విస్తృతంగా అన్వేషణ ప్రారంభించామని కానీ అతని జాడ లభించలేదని షెర్పా చెప్పారు.మంగళవారం కూడా అనురాగ్ కోసం శోధనను కొనసాగిస్తున్నారు. అనురాగ్ భారతదేశం నుంచి 2041 అంటార్కిటిక్ యూత్ అంబాసిడర్.అన్నపూర్ణ ప్రపంచంలోని పదవ ఎత్తైన పర్వతం. ఇది సముద్ర మట్టానికి 8,091 మీటర్ల ఎత్తులో ఉంది.ఈ పర్వతం ప్రమాదాలకి ప్రసిద్ధి చెందింది.
Updated Date - 2023-04-18T11:34:56+05:30 IST