Indian Railway: శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో భోజనంపై ప్యాసింజర్ ట్వీట్.. నెట్టింట్లో ఫొటో వైరల్
ABN, First Publish Date - 2023-04-11T17:24:44+05:30
ఓ ప్యాసింజర్ పోస్ట్ చేయడంలో ఇండియన్ రైల్వే(Indian Railways) అందరి హృదయాలను దోచుకుంది..
శతాబ్ది ఎక్స్‌ప్రెస్(Shatabdi Express)లో ప్రయాణికులకు అందించే భోజనం బాగుందంటూ ఫొటోను సోషల్ మీడియాలో ఓ ప్యాసింజర్ పోస్ట్ చేయడంతో ఇండియన్ రైల్వే(Indian Railways) అందరి హృదయాలను దోచుకుంది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కేంద్ర రైల్వే సహాయమంత్రి దర్శన్ జర్దోష్(Union Minister Darshana Jardosh) తోపాటు సోషల్ మీడియా యూజర్ల నుంచి ప్రసంశల ట్వీట్లు వెల్లువెత్తాయి.
‘‘చాలా రోజుల తర్వాత నేను శతాబ్ధి ఎక్స్‌ప్రెస్(Shatabdi Express)లో ప్రయాణించాను. ఫుడ్ క్వాలిటీ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది, గడిచిన తొమ్మిదేళ్లలో రైల్వే నిజంగా మారిపోయింది’’. అని సిన్హా అనే ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్‌కు స్పందించిన రైల్వే సహాయ మంత్రి దర్శన జర్దోష్ ‘‘సరికొత్త భారతంలో నూతన రైళ్లలో మీరు ఆహారాన్ని పొందుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.
ఈ ఫొటో ట్విట్టర్‌లో పెట్టిన వెంటనే వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లను పోస్టులు ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ‘‘కొద్ది రోజుల క్రితం నేను పుణె రైల్వే స్టేషన్‌లో దోశ తిన్నాను. దోశతో ఇచ్చిన చట్నీ అద్భుతంగా ఉంది. షాపు ఓనర్‌తోపాటు ఇండియన్ రైల్వేకు ధన్యావాదాలు’’ అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.
‘‘ఇది ప్రతి ప్రయాణికుడు కోరుకునే మంచి ఆహారం అని.. రైల్వే యాజమాన్యం చొరవకు, శ్రమకు ధన్యవాదాలు అని మరో ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు.
రైల్వే ప్యాసింజర్లకు అందించిన భోజనం తాజాగా, రుచికరంగా ఉంది అందులో ఎలాంటి సందేహం లేదు. ఆలూ కర్రీ, పప్పు, పర్‌ఫెక్ట్‌గా ఉడికించిన అన్నం, నాన్ ప్లాస్టిక్ డిస్పోజల్స్ అన్ని చాలా ఫర్‌ఫెక్ట్‌గా ఉన్నాయని మరో నెటిజన్ రాశాడు.
మరో ట్విట్టర్ యూజర్ స్పందిస్తూ.. గతేడాది హౌరా-రాంచీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నపుడు తనకు అందించిన ఆహారం బాగుందని రైల్వే శాఖను కొనియాడారు. రైళ్లలో కూడా ఇఫ్తార్ విందు అందించినప్పుడు ఆశ్చర్యపోయానని తెలిపాడు.
Updated Date - 2023-04-11T17:49:13+05:30 IST