ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Turkey and Syriaకు చేరుకుంటున్న భారత సహాయక బృందాలు

ABN, First Publish Date - 2023-02-07T13:12:57+05:30

టర్కీ, సిరియాలను భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టర్కీ, సిరియాలకు సహాయక బృందాలను, సామాగ్రిని పంపిస్తామని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Turkey and Syria Earthquake : టర్కీ, సిరియాలను భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టర్కీ, సిరియాలకు సహాయక బృందాలను, సామాగ్రిని పంపిస్తామని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ప్రకటించింది. ఈ క్రమంలోనే భారత సహాయక బృందాలు దాదాపు టర్కీకి చేరుకున్నాయి. నిపుణులైన జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) బృందాలు, అత్యంత నైపుణ్యంగల జాగిలాల స్క్వాడ్స్, ఔషధాలు, అడ్వాన్స్‌డ్ డ్రిల్లింగ్ ఎక్విప్‌మెంట్, సహాయక చర్యలకు అవసరమయ్యే ముఖ్యమైన పరికరాలు వీటిలో ఉన్నాయి. టర్కీకి బయలుదేరిన ఎన్‌డీఆర్ఎఫ్ బృందంలో మహిళలు కూడా ఉండటం విశేషం.

ఉదయం వాయుసేనకి చెందిన సీ17 ఎయిర్ బోన్ విమానంలో టర్కీ అదాన ఎయిర్పోర్ట్‌కి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ప్రత్యేక డాగ్ రెస్క్యూ టీమ్స్‌కు చెందిన 50 మంది చేరుకున్నారు. అలాగే కాసేపటి క్రితం సహాయక సామగ్రితో సి17 రెండో విమానం బయలుదేరింది. మధ్యాహ్నానికి వైద్య సామగ్రి, మందులతో సి130 విమానం డెమాస్కస్ చేరుకోనుంది. వైద్య, సహాయక సిబ్బందితో టర్కీకి మరో రెండు సి17 విమానాలు వెళ్లనున్నాయి. టర్కీ, సిరియాలో సహాయక చర్యలను కేంద్ర విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తోంది. టర్కీలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారత సహాయక బృందాలు సహాయక కార్యక్రమాలను ప్రారంభించాయి. టర్కీ, సిరియాల్లో అవసరాల మేరకు సాయం చేయడానికి ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నట్లు విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - 2023-02-07T13:17:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising